Lassi: పెరుగు అన్నం తినకపోతే మనం చేసిన భోజనం పరిపూర్ణం కాదు. పెరుగును మజ్జిగ చేసి తాగుతాం. పెరుగులో పంచదార వేసుకుని ఇష్టంగా తింటాం. లస్సీ చేసుకుని తాగుతాం. ఒక్క వేసవిలో మాత్రమే లస్సీ మరీ ఎక్కువగా తాగుతాం. అయితే.. పంజాబ్ లో సమ్మర్ లో మాత్రమే కాదు.. లస్సీ రెగ్యులర్ గా తాగుతారు. పాలతో వచ్చే పెరుగు ఎంతో ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి వాళ్లు లస్సీగా చేసుకుంటారు. లస్సీలో ఉండే బాక్టీరియా మనం తిన్న ఆహారాన్ని తేలిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. జీర్ణక్రియలో ఏమైనా సమస్యలున్నా పోగొడుతుంది.
నిజానికి మన శరీరం ఎప్పుడైనా అలసిపోయినట్టు అనిపిస్తే లస్సీ తాగడం బెటర్. వెంటనే మన బాడీ యాక్టివ్ గా మారడంలో సహకరిస్తుంది. ఇందుకు కాలంతో సంబంధం లేదు. ఇప్పుడు ప్రయాణాల్లో ఉన్నా.. బయల అయినా డైరీ షాపుల్లో లస్సీ రెడీమేడ్ గా దొరుకుతుంది. కొన్ని ఏరియాల్లో మట్టి కుండల్లో పెరుగును అప్పటికప్పుడు లస్సీగా తయారు చేస్తారు. వీటన్నింటికంటే ఇంట్లో చిక్కటి పెరుగుతో తయారు చేసే లస్సీ అయితే మరీ మంచిది.
ఎందుకంటే లస్సీలో కాల్షియం, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో అవసరం. కండరాలు శక్తిని ఇస్తాయి. బలంగా తయారయేలా చేస్తాయి. అధిక బరువు పెరగరు కూడా. మొలాసెస్ నుంచి తయారుచేసే లస్సీ తాగడం వల్ల మరింత మేలు జరుగుతుంది. ఇది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరించడమే కాకుండా పొట్టలో పేరుకుపోయిన గ్యాస్, అజీర్తి, అనారోగ్యాలను పోగొడుతుంది. లస్సీలో ఉండే లాక్టిన్, విటమిన్ డి ఇమ్యునిటీ పవర్ పెంచుతాయి. కాల్షియం కూడా ఉండటం వల్ల ఎములకు బలం చేకూరుతుంది.
లస్సీలో ఎలక్ట్రోలైట్స్ మన శరీరాన్ని తేమగా ఉంచుతాయి. ఎండలో తిరిగినా చర్మం కమిలిపోదు. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే వేసవి ఎండలో ఎవరైనా లస్సీ కోసం చూస్తారు. తాగిన తర్వాత రిలాక్స్ ఫీలవుతారు. లస్సీ తాగడం వలన బాడీలో వేడి తగ్గుతుంది. రోజూ మధ్యాహ్నం భోజనం తర్వాత లస్సీ ఓ గ్లాస్ తాగితే శరీరంలో వేడి బ్యాలెన్స్ కావడమే కాదు.. చలవ చేస్తుంది కూడా. రాత్రిపూట నిద్రపోయే ముందు కానీ అంతకు ముందే తాగినా చాలా మంచిది.
గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.