తులసి, పుదీనా, అల్లం..తో ఈ అనారోగ్య సమస్యలన్నీ దూరం..!!

రోజువారీ పనుల్లో భాగంగానో, ఒత్తిడి వల్లనో తలనొప్పి వస్తూంటుంది.. తగ్గుతుంది. కానీ.. అదే తలనొప్పి తీవ్రమైతే ఆలోచించాల్సిందే. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పి అయితే మాత్రం తీవ్రంగా ఆలోచించాల్సిందే. మొదట్లోనే ఆ తలనొప్పిని తగ్గించుకుంటూ వెళ్లాలి. లేదంటే ప్రమాదమే. అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా అల్లం, పుదీనా, తులసి.. ఇవన్నీ మైగ్రేన్ తలనొప్పి బాధను తగ్గిస్తాయి. ఎందుకంటే ఇందులో యాంటీ-బాక్టీరియల్ గుణాలు ఎక్కవగా ఉంటాయి. వీటివల్ల దక్కే ఉపయోగాలు ఉన్నాయి.

తులసి రసం, పసుపు నీరు తాగినా కూడా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. పసుపులో ఉండే యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తంలో గడ్డకట్టుకొని ఉన్న కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. ఇందులోని యాంటీ బయోటిక్ గుణమే ఇందుకు కారణం. ఒత్తిడి, టెన్షన్, కంగారు, ఆతృత, ఆందోళన, అయోమయం, కంగారు వంటి లక్షణాలను దూరం చేస్తుంది. తులసి, అల్లం, నల్ల మిరియాలతో టీ తాగితే నరాల వ్యవస్థ మెరుగవుతుంది.

మహిళలకు ఒత్తిడితోపాటు పలు సమస్యలను తొలగిస్తుంది పుదీనా. పిరియడ్స్ సమయంలో జీర్ణక్రియలో తేడాలు వస్తాయి. ఈ సమయంలో పుదీనా బాగా ఉపయోగపడుతుంది. కొన్ని పుదీనా ఆకులను తినడమో.. లెమన్ టీలో వేసుకొని తాగడమో చేస్తే ఫలితం ఉంటుంది. లెమన్ టీ చేయడానికి ఉపయోగించే నిమ్మకాయ తాజాగా ఉండాల్సందే. మచ్చలున్న నిమ్మకాయను వాడకుండా ఉత్తమం.

మైగ్రేన్ తలనొప్పి తీవ్ర ఒత్తిడి కలిగిస్తుంది. ఈ సమయంలో తులసి, పుదీనా, అల్లంతో డికాక్షన్ చేసుకుని అందులో కొంత ఉప్పు వేసి తాగితే చలికాలంలో వచ్చే జలుబు నుంచి ఉపశమనం ఇస్తుంది. వీటిలో ఔషధ గుణాలు ఉండటమే ఇందుకు కారణం. ప్రతిరోజూ తులసి ఆకులను నమిలితే చాలా మంచిది. రోజకు నాలుగైదు సార్లు 6-7 తులసి ఆకులు నమిలితే ఫలితం ఉంటుంది. అల్లం, తులసి, పుదీనా ఆకులు కండరాల నొప్పులను తగ్గించే గుణాలు కలిగి ఉన్నాయి.

చర్మ సంబంధమైన సమస్యలకు తులసి బాగా ఉపయోగపడుతుంది. మెరిసే చర్మం కోసం తులసి ఆకుల నుంచి రసాన్ని తీసి అందులో అంతే నిమ్మరసాన్ని కలిపి రాత్ర నిద్రపోయే ముందు ముఖానికి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇందులోని యాంటీ – ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. తులసిని కాస్మొటిక్ క్రీములు, లోషన్లలో వాడుతారనే విషయం కూడా తెలిసిందే.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.