చేపలు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు.. తెలిస్తే తప్పకుండా తింటారు..!

Health Tips: ప్రస్తుత కాలంలో తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తోంది. ఈ రోజుల్లో ఎక్కువమంది మాంసాహారం తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. మాంసాహారం తినే వారు చికెన్, మటన్ వంటి వాటిని ఎక్కువగా తినటానికి ఆసక్తి చూపుతారు. కానీ చేపలు తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. తరచూ చేపలు తినటం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 

2016 లో అమెరికా కు చెందిన కొందరు శాస్త్రవేత్తలు చేపలు ఎక్కువ తినే వారి మీద పరిశోధన చేశారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అందరిలో మతిమరుపు సమస్య మొదలవుతుంది. ఆ సమస్యను నిర్లక్ష్యం చేయటం వల్ల అది అల్జీమర్స్ వ్యాధికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. అయితే చేపలు తినటం వల్ల ఈ సమస్యలు దరిచేరకుండా ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. తరచూ చేపలు తినడం వల్ల మతి మరుపు సమస్యలు తొలగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

చేపలలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ కీళ్ల నొప్పుల సమస్యను తగ్గిస్తాయి. అంతేకాకుండా చేపలు తినటం వల్ల నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు కూడా దరిచేరకుండా ఉంటాయి.చేపలను ఎక్కువగా తినటం వల్ల వాటిలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ శరీరంలో రక్త నాళాలను శుభ్రపరిచి ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం తగ్గుతుంది. చేపలను తినటం వల్ల నిద్రలేమి సమస్యలు కూడా దూరమవుతాయి.