Health Tips: సాధారణంగా మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు ఉపయోగించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వేరుశనగ విత్తనాలను తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వేరుశనగలో విటమిన్లు, పీచు పదార్థాలు,ప్రోటీన్లు, ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా వేరుశెనగల్లో ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా 100 గ్రాముల వేరుశెనగల్లో సుమారుగా 567 కేలరీలు, 25.8 గ్రాముల ప్రొటిన్లు, 49.2 గ్రాముల ఫ్యాట్, 16.1 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 8.5 గ్రాముల ఫైబర్ లభిస్తుంది.
వేరుశనగ విత్తనాలు తినడం వల్ల మెదడు పనితీరును మెరుగుపడి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తాయి. వేరుశెనగలను ఉడకబెట్టి తినడం వల్ల శరీరానికి కావలసిన రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా నియంత్రిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించే గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతాయి.
వేరు శెనగ విత్తనాలు తినటం వల్ల శరీరంలో సెరోటోనిన్ అనే పదార్థాన్ని విడుదల చేసి మానసిక ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇందులో ఒమేగా ఫ్యాటీ 3 ఆమ్లాలు, విటమిన్ ఇ అధికం ఉండటం వల్ల గుండె నుంచి ఇతర భాగాలకు రక్తాన్ని చేరవేసే రక్తనాళాలు ముసుకుపోకుండా కాపాడతాయి.
ముఖ్యంగా ఆస్తమా సమస్య ఉన్నవాళ్లు వేరుసెనగ లు తక్కువగా తినటం మంచిది. ఈ సమస్య ఉన్న వారు కాస్త ఉప్పునీళ్లలో ఉడికించి తింటే అంతగా సమస్య ఉండదు. అలాగే గ్యాస్త్ట్రెటిస్, కామెర్లు ఉన్నవాళ్లు కూడా వీటిని ఎక్కువ వాడకూడదు.