Skin Care Tips: పిల్లల్లో ఈ లక్షణాలు గమనించారా? అయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి..!

Skin Care Tips:అందంగా కనపడాలి అని ఎవరికి ఉండదు.. పిల్లలు, పెద్దలు, మహిళలు, పురుషులు అనే బేధం లేకుండా అందరూ అందంగా కనిపించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.ఫేస్ క్రీములు, పౌడర్లు చర్మం మీద రాస్తుంటారు. అయితే కొంత మంది పెద్దలు, పిల్లలలో తెల్లటి మచ్చలు చూస్తుంటారు. తెల్లమచ్చలు వయసుతో సంబంధం లేకుండా ముఖం, చేతులు, ఇతర శరీర భాగాల మీద ఈవిధమైన మచ్చలు చూస్తుంటారు. అవి ఎందుకు ఏర్పడతాయి అనేది ఇప్పుడు చూద్దాం.

ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు,కల్తీ ఆహార పదార్థాలు తినటం వల్ల అనేక ఆరోగ్య, చర్మ సంబంధిత వ్యాధులు కూడా తలెత్తుతాయి. ఈ తెల్ల మచ్చలు రావడానికి ముఖ్యంగా రెండు రకాల కారణాలు ఉన్నాయి. మొదటిది హైపో పిగ్మెంటెడ్ ప్యాచెస్, రెండవది డి పిగ్మెంటెడ్ ప్యాచెస్. మెలోనోసైట్స్ తగ్గడం వల్ల మన శరీరం రంగుకంటే తక్కువ రంగులో మచ్చలు వస్తుంటాయి. దీనిని హైపో పిగ్మెంటెడ్ ప్యాచెస్ అంటారు. మెలేనోసైట్స్ ఎక్కువగా ఉండటం వల్ల డి పిగ్మెంటెడ్ ప్యాచెస్ వస్తాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలో పోషకాహార లోపం ఉంటడం వల్ల కూడా తెల్లటి మచ్చలు వస్తాయి. సన్ లైట్ లేదా UV లైట్ కి బాడీ ఎక్స్పోజ్ అయ్యి, అలర్జీ ఉన్నట్లయితే తెల్ల మచ్చలు వస్తాయి అని నిపుణులు సూచిస్తుంటారు. శరీరం పై తెల్ల మచ్చలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి అని నిపుణులు సూచిస్తున్నారు. సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వల్ల పోషకాహార లోపంతో ఇలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.