Home News బిగ్ బాస్‌4: హారిక ఖతర్నాక్ స్కెచ్.. అభీని కూడా మోసం చేసి సేఫ్ గేమ్ ఆడుతున్న...

బిగ్ బాస్‌4: హారిక ఖతర్నాక్ స్కెచ్.. అభీని కూడా మోసం చేసి సేఫ్ గేమ్ ఆడుతున్న దేత్త‌డి

బిగ్ బాస్ తెలుగు హౌస్‌లో ఎక్కువమందికి టార్గెట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే..అతడు అభిజిత్ మాత్రమే. అతడి తెలివితేటలను తట్టుకోలేని కంటెస్టెంట్లు పదే, పదే నామినేట్ చేస్తున్నారు. అయితే అతడికి పబ్లిక్ ఓట్లు దండిగా వేస్తుండటంతో ఈజీగా సేవ్ అవుతున్నాడు. అంటే పబ్లిక్‌లో అతడికి ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉన్నట్లే కదా. ఈ విషయాన్ని దేత్తడి హారిక పసిగట్టింది. దీంతో అభితో ఫ్రెండ్షిప్ షురూ చేసింది. ఈ క్రమంలో అభికి మరింత దగ్గరవుతూ తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాన్ని కొంతమంది వీక్షకులు అర్థం చేసుకున్నారు. మరికొందరు మాత్రం అభి, హారిక బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి..చెరొక 5 ఓట్లు గుద్దేస్తున్నారు. మరికొందరైతే అభి ఎలాగూ సేవ్ అవుతాడు కదా..హారికాను సేవ్ చేద్దామని అన్నీ ఓట్లు ఆమెకే వేస్తున్నారు.

Harika Plan | Telugu Rajyam

మోనల్‌‌ను దూరం చేసింది..స్వాతి దగ్గరైతే జలస్ ఫీలయ్యింది..

అభికి దగ్గరయ్యే ప్రయత్నంలో హారిక చాలా జాగ్రత్తలు తీసుకుంది. స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అభి చాలా ఎగ్జయిట్ అయ్యాడు. ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. టాస్కుల సమయంలో ఆమెకు హెల్ప్ చేయడం మొదలెట్టాడు. దీంతో హారిక బాగా హర్టయింది. ఆమెకు ఎందుకు హెల్ప్ చేస్తున్నావ్..నాకు ఎందుకు చెయ్యడం లేదని డైరెక్ట్ గా అడిగింది. దీంతో సారీ చెప్పిన అభిజిత్..ఇంకా సారి ఇలా చేయను అని ప్రామిస్ చేశాడు. వచ్చి వారంలో వెళ్లిపోవడంతో ఆమెతో పెద్దగా టెన్షన్ రాలేదు. కానీ మోనల్, అభిల మధ్య మంచి ర్యాపో మొదలైన సమయంలో పక్కనే ఉన్న హారిక …పలు ప్రయత్నాలు చేసి వారి మధ్య గ్యాప్ పెంచేలా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మోనల్, అభి చెరో దిక్కు వెళ్లిపోయారు. దీంతో అభితో, హారిక సోలో ఫ్రెండ్ గా మిగిలిపోయింది. ఫ్రెండ్షిఫ్‌కు మించిన కెమిస్ట్రీనే నడుస్తోంది. ‘అభికా’ పేరుతే వారి వీడియోలు ఒక రేంజులో ట్రెండ్ అవుతన్నాయి.

మొత్తానికి హారిక మంచి మాస్టర్ ప్లాన్‌తో గేమ్ ఆడుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆమె టైటిల్ గెలవకపోవచ్చు కానీ..ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండేందుకు ఇది మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. అసలు అక్కడకు వెళ్లిందే, గేమ్ ఆడటం కోసం…హారిక ఈ తరహా గేమ్ ఆడటంలో ఎటువంటి తప్పు లేదని ఆమెను అభిమానించేవారి మాట. సో హారిక ఇంకా ఎన్ని రోజులు హౌస్ ‌లో ఉంటుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

- Advertisement -

Related Posts

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎవ‌రిని కొట్ట‌డానికి మార్ష‌ల్స్ నేర్చుకున్నాడో తెలిస్తే, షాక‌వుతారు!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్ర‌స్తుతం ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న గురించి ఏ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చిన అది ఆస‌క్తిక‌రంగానే ఉంటుంది. తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మార్ష‌ల్ ఆర్ట్స్...

గొల్లపూడిలో టెన్షన్‌ టెన్షన్ .. పోలీసుల హై అలర్ట్

ఏపీలో రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది… ఇక, కృష్ణా జిల్లా రాజకీయాలో మరోసారి హాట్ టాపిక్‌గా మారిపోయాయి… మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించిన మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌...

ప్యాంట్ వేసుకోకుండా ఈ రచ్చ ఏంటి.. తేజస్వీ పిక్ వైరల్

బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మడివాడకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న తేజస్వీ.. బిగ్ బాస్ షో వల్లే మరింత క్రేజ్ తెచ్చుకుంది. అయితే...

Latest News