Big Boss Season 6: బిగ్ బాస్ తెలుగు టీమ్ కి రాజకీయ నాయకుల నుండి వెల్లువెత్తిన ఫోన్ కాల్స్..!

Big Boss Season6 : బుల్లితెర మీద ప్రసారమైన ఎన్నో రియాలిటీ షోలు బాగా పాపులర్ అయ్యాయి. అటువంటి రియాలిటీ షోలలో బిగ్ బాస్ కూడా ఒకటి. దేశమంతటా గుర్తింపు పొందిన ఈ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రారంభమై ఇప్పటికే బుల్లితెర మీద ఐదు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఓటిటిలో కూడా ఒక సీజన్ పూర్తి చేసుకుంది. ఈ రియాలిటీ షో లో పాల్గొన్న సెలబ్రిటీలు ఎంత పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిన విషయమే. ఈ షో లో పాల్గొనే వారు డబ్బు కన్నా పాపులారిటీ వస్తుందని భావించి ఈ షో లో పాల్గొనటానికి ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆగష్టు లో బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్ లో విషయంలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి కంటెస్టెంట్ ల ఎంపిక పూర్తయినట్టు కొందరు అంటుంటే.. ఇంకా కంటెస్టెంట్ ల కోసం బిగ్ బాస్ టీమ్ వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీజన్ 6 లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకి కూడా పాల్గొనే అవకాశం ఉందని నాగార్జున ఇప్పటికే ప్రకటించాడు. అందువల్ల సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఈ షోలో పాటిస్పేట్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలో కొంతమంది పలుకుబడి ఉపయోగించి బిగ్ బాస్ టీం వారిని సంపాదిస్తుంటే, మరి కొంతమంది బిగ్ బాస్ షోలో పాల్గొనేందుకు డబ్బులు ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదు అంటూ సమాచారం. సెలబ్రిటీలతో పాటు సోషియల్ మీడియా ద్వార ఫేమస్ అయిన వారు మరింత పాపులారిటీ కోసం తమకి తెలిసిన ప్రముఖుల చేత మా టీవీ వారిని, బిగ్ బాస్ టీమ్ వారిని సంప్రదిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వైకాపా మరియు టీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన కొందరు రాజకీయ నాయకులు వారి సన్నిహితుల కోసం బిగ్‌ బాస్ టీమ్‌ వారిని సంప్రదిస్తున్నారు అంటూ సమాచారం .మొత్తానికి బిగ్ బాస్ లో పాల్గొనేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.