Harihara Veeramallu : పవన్ ని మరో స్థాయిలో నిలబెట్టడమే టార్గెట్ !

Harihara Veeramallu : తెలుగు రాష్ట్రాల్లో అయితే భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి స్టార్ హీరోలలో గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. మన దగ్గర భారీ ఫాలోయింగ్ పవన్ కి సొంతం అలాగే తమిళ కన్నడ రాష్ట్రాల్లో కూడా పవన్ సినిమాలు బాగానే ఆడుతాయి. అయితే ఇపుడు పాన్ ఇండియా సినిమాల పర్వం మొదలైంది.
దీనితో ప్రతి హీరోకి మన దక్షిణాది క్రేజ్ తో పాటు ఉత్తరాది క్రేజ్ కూడా తప్పనిసరి అందుకే పాన్ ఇండియా రిలీజ్ అంటే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మరి అలాగే పవన్ కూడా తన కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. దర్శకుడు క్రిష్ తో “హరిహర వీరమల్లు” అనే పీరియడ్ బ్యాక్ డ్రాప్ సినిమాని భారీ స్థాయి విజువల్స్ మరియు యాక్షన్ కంటెంట్ తో తెరకెక్కిస్తున్నారు.
మరి ఇదంతా బాగానే ఉండగా తాజాగా ఈ సినిమా నిర్మాత ఏ ఎం రత్నం పలు కామెంట్స్ చెయ్యడం ఆసక్తిగా మారింది. ఈ సినిమాని మేము చాలా ప్రతిష్టాత్మకంగా పవన్ కోసం తీస్తున్నామని మన దగ్గర ఆయా ఆయన క్రేజ్ కోసం అందరికీ తెలుసు కానీ పవన్ ఇమేజ్ ని మరింత స్థాయిలో సెట్ చేసి పెట్టాలి అన్నదే మా లక్ష్యం అన్నట్టుగా తాను సాలిడ్ స్టేట్మెంట్ అందించారు.
దీనితో పవన్ అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. మరి వారు అన్నట్టుగానే ఈ సినిమా పవన్ ని నిజంగా ఆ రేంజ్ లో నిలబెడుతుందో లేదో కాలమే డిసైడ్ చెయ్యాలి. ఇంకా ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా పలువురు బాలీవుడ్ స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే కీరవాణి సంగీతం అందిస్తున్నారు.