Pawan Kalyan: సినిమాల విషయంలో వెనక్కు తగ్గని రేవంత్… పవన్ కోసం వెనకడుగు వేస్తాడా?

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత సినిమాలను పెద్దగా చేయలేదని తెలుస్తోంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటి సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు.. ఈ సినిమా 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇదివరకు విడుదల చేసిన ట్రైలర్ సినిమా పట్ల అంచనాలను పెంచేయడమే కాకుండా 24 గంటల సమయంలో భారీ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుని పుష్ప 2 రికార్డులను బద్దలు కొట్టింది.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాకు ఏపీలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. టికెట్ల రేట్లు పెంచడంతో పాటు ప్రీమియర్స్ మిడ్ నైట్ షోలకు కూడా అనుమతి ఉంది. అయితే తెలంగాణలో ప్రీమియర్లకు అనుమతి లేదనే సంగతి మనకు తెలిసిందే. పుష్ప2 సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో అప్పటినుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రీమియర్ షోలకు అనుమతి లేదని తెలిపారు.

ఇలా ఇప్పటివరకు ఏ సినిమాలకు తెలంగాణలో ప్రీమియర్లకు మిడ్ నైట్ షోలకు అనుమతి లేదు కానీ పవన్ కళ్యాణ్ సినిమాకు ప్రీమియర్ వేయాలని అభిమానులతో పాటు నిర్మాతలు కూడా ఎంతో కృషి చేస్తున్నారని తెలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ సినిమాకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. జులై 2న సంధ్య థియేటర్‌లో జరగాల్సిన హరిహర వీరమల్లు ట్రైలర్ స్క్రీనింగే క్యాన్సిల్ అయింది. అభిమానుల రద్దీతో పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా కారణాలతో ట్రైలర్ ప్రదర్శనను ఆపేశారు. అయితే ప్రీమియర్స్ కోసం నిర్మాతలు థియేటర్ యాజమాన్యంతో పాటు పోలీసులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తుంది. మరి పోలీసుల నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ సినిమాకు ఏ విధమైనటువంటి అనుమతులు వస్తాయో తెలియాల్సి ఉంది.