Krish Jagarlamudi: జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఒకే రోజులోనే ప్రెస్ మీట్ కార్యక్రమంతో పాటు ఫ్రీ రిలీజ్ వేడుకలు కూడా ఈయన హాజరై సందడి చేశారు.
ఇలా పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్న నేపథ్యంలో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే ఈ సినిమాకు మొదట క్రిష్ దర్శకత్వం వహించగా కొన్ని కారణాలవల్ల క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకుడిగా బాధ్యతలు చేపట్టారని తెలుస్తోంది. అయితే క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇక ఇప్పటివరకు క్రిష్ ఈ సినిమా విషయంలో మౌనం పాటిస్తూనే ఉన్నారు.
ఇక ఈ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు వీరమల్లు ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాడు.ఈ సినిమా నిశ్శబ్దంగా కాదు, గొప్ప ఆశయంతో చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ ప్రాజెక్టు ఇద్దరు లెజెండ్స్ వల్లే సాధ్యమైంది. ఒకరు పవన్ కల్యాణ్. అసాధారణ శక్తికి రూపం ఉందంటే అది పవన్ కల్యాణ్ రూపంలోనే ఉంటుంది. ఆయన ఒక రగిలే అగ్నికణం. ఎందరికో ఆదర్శం. ఈ సినిమాలో ప్రాణం పోసినవారు ఆయనే. ఆయనే ఈ చిత్రానికి వెన్నెముక అంటూ పవన్ కళ్యాణ్ పై ప్రశంశలు కురిపించారు.
ఇకపోతే నిర్మాత ఏం రత్నం గురించి కూడా ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ఈ సినిమా మరొక రెండు రోజులలో విడుదల కాబోతుందన్న నేపథ్యంలో క్రిష్ స్పందిస్తూ.. చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేయడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
