డెలివరీ తర్వాత జుట్టు రాలిపోతుందా.. అయితే ఈ ఒక్క చిట్కా పాటించండి!

ప్రెగ్నెంట్ సమయంలో శరీరంలో హార్మోన్స్ మార్పు వల్ల ఈస్ట్రోజన్ లెవెల్ పెరిగి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. సహజంగా మనిషికి రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోతాయి. ప్రెగ్నెంట్ టైం లో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగి జుట్టు ఎంత ఒత్తుగా పెరుగుతుందో అలాగే డెలివరీ తర్వాత ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గడం వల్ల జుట్టురాలే సమస్య అధికమవుతుంది.సాధారణంగా ప్రసవం తర్వాత జుట్టు రాలే సమస్య 5 నుండి 8 నెలల వరకు ఉంటుంది. ఇది డెలివరీ తర్వాత ప్రతి ఒక్కరిలో ఉండే సమస్య. కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించి ఈ సమస్యను కంట్రోల్ చేయవచ్చు. ఇప్పుడు మనం ఆ చిట్కాల గురించి తెలుసుకుందాం.

జుట్టు పెరుగుదలకు ముఖ్యంగా ప్రోటీన్ చాలా అవసరం. గుడ్డులో మన జుట్టుకి కావాల్సిన ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. గుడ్డులోని తెల్లసొన మన జుట్టుకు రాయటం వల్ల జుట్టుకి కావలసిన ప్రోటీన్ లభించి జుట్టురాలే సమస్య తగ్గటమే కాకుండా స్మూత్ అండ్ షైనీ గా తయారవుతుంది.ఇంకొక ముఖ్యమైన చిట్కా ఏంటంటే మెంతులు మన జుట్టుకి కావాల్సిన పోషణ ఇస్తాయి. రాత్రి మూడు చెంచాల మెంతులను నీటిలో నానబెట్టి ఉదయమే ఆ మెంతులను మెత్తగా పేస్ట్ చేసి జుట్టుకు రాసి గంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

ఇలా మిత్రులను వారానికి రెండుసార్లు తలకు పట్టించుకుని స్నానం చేయటం వల్ల తేడా మీరే గమనించవచ్చు. కుంకుడు కాయ, పెరుగు కలిపి పేస్ట్ చేసి తలకు రాసి ఒక అరగంట తర్వాత దానిని శుభ్రం చేసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. పెరుగు జుట్టురాలే సమస్య దూరం చేయడమే కాకుండా జుట్టుకు మంచి కండీషనర్ గా కూడా ఉపయోగపడుతుంది. ఈ విధమైనటువంటి చిట్కాలను పాటించడం వల్ల జుట్టు రాలే సమస్యను పూర్తిగా నివారించవచ్చు.