భారతీయ జనతా పార్టీ ఆంధ్రా విషయంలో ద్వంద వైఖరిని అవలంభిస్తున్న సంగతి తెలిసిందే. తెర వెనుక జగన్‌తో స్నేహం చేస్తూనే ఆంధ్రాలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉంది. అందుకు అనుగుణంగానే పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ఈ ప్రణాళికలో ప్రధాన ఉద్దేశ్యం జగన్‌ను జాతీయ స్థాయిలో వాడుకోవడం, రాష్ట్ర స్థాయి తిట్టి పోయడం. అంటే రాష్ట్రంలో ఏ బీజేపీ నాయకుడు కూడ వైసీపీని, జగన్‌ను పొగడకూడదన్నమాట. ఈ వైఖరిని ఎవరు మీరినా వారి మీద వేటు తప్పదన్నట్టు ఉంది బీజేపీ శైలి.
అందుకు తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు వఛ్చిన కష్టమే నిదర్శనం. జీవీల్ నరసింహారావుకు ఇన్నాళ్లు ఉన్న బీజేపీ అధికార ప్రతినిధి హోదా ఉండేది. కానీ బీజేపీ కొత్త అధ్యక్షుడు జేపీ నడ్డా ఏర్పాటుచేసుకున్న కొత్త కార్యవర్గంలో ఆయన ఆ హోదా నుండి తొలగించబడ్డారు. జీవీఎల్ నరసింహారావు బీజేపీ ప్రతినిధిగా మంది పలుకుబడి ఉండేది. ఆయన పనితనం సైతం బాగానే ఉండేది. పెద్దగా ఆయన మీద పిర్యాధులు లేవు. రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులతో ఆయనకు సత్సంబంధాలే ఉండవి. అయినా ఆయన్ను ఉన్నపళంగా పీకి పక్కనపడేయడానికి కారణం జగన్ అనే టాక్ వినిపిస్తోంది.
జీవీల్ నరసింహారావు మొదటి నుండి వైఎస్ జగన్ పట్ల సాఫ్ట్ కార్నర్ చూపేవారు. ప్రతిసారీ కాకపోయినా అప్పుడప్పుడూ జగన్‌కి అనుకూలంగా మాట్లాడేవారు. ఆయన వలన పలు సందర్భాల్లో రాష్ట్ర బీజేపీ నాయకులు జగన్ విషయంలో నాలుక కరుచుకునేవారు. ఇదే బీజేపీ అధిష్టానానికి నచ్చలేదట. నిబంధనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో జగన్ పక్షాన మాట్లాడటాన్ని వారు సహించలేకపోయారు. అందుకే ఆయన్ను అధికార ప్రతినిహి హోదా నుండి పక్కకు తప్పించారని అంటున్నారు. మరోవైపు ఆయనకు కేంద్రంలో మంచి పదవి దక్కనుందని, అందుకే అధికార ప్రతినిధి హోదా నుండి తొలగించారని ప్రచారం జరుగుతున్నా ఎక్కువమంది మాత్రం జగన్ విషయాన్నే నమ్ముతున్నారు.