Home News అఖిల్‌కు దూర‌మైన మోనాల్ ‌.. కెమెరా కంటికి కూడా చిక్క‌ని గుజ‌రాతీ భామ‌

అఖిల్‌కు దూర‌మైన మోనాల్ ‌.. కెమెరా కంటికి కూడా చిక్క‌ని గుజ‌రాతీ భామ‌

గుజరాతీ భామ మోనాల్ గ‌జ్జ‌ర్ .. బిగ్ బాస్ సీజన్ 4 తొలి కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టింది.అభిజీత్, అఖిల్‌ల‌తో ఎక్కువ క్లోజ్‌గా ఉంటూ, అడ‌పాద‌డపా గ్లామర్ షో చేస్తూ ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్న చేసింది. మొద‌ట్లో చీటికి మాటికి ఏడ‌స్తూ ప్రేక్ష‌కుల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన ఈ అమ్మ‌డు త‌ర్వాత చాలా తెలివిగా గేమ్ ఆడుతూ వ‌చ్చింది. అభిజీత్‌తో కొన్నాళ్ళు , అఖిల్‌తో మ‌రికొన్నాళ్ళు పులిహోర క‌లుపుతూ వ‌చ్చిన మోనాల్‌కి ఇప్పుడు గ‌డ్డు కాలం న‌డుస్తుంది. ఈ అమ్మ‌డిని ప‌ట్టించుకునే వారే క‌రువ‌య్యారు. అఖిల్‌.. మోనాల్‌ని దూరం పెట్టిన త‌ర్వాత అస‌లు కెమెరా కంటికి క‌నిపించ‌డమే త‌క్కువైంది.

Akhils Monal | Telugu Rajyam

మోనాల్ గ‌జ్జ‌ర్.. అభిజీత్, అఖిల్ మ‌ధ్య ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ న‌డుస్తుందేమోన‌ని షో మొద‌ట్లో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కాని కొన్నాళ్ళ త‌ర్వాత అభిజీత్‌కు చాలా దూర‌మైన మోనాల్ అఖిల్‌కు చాలా దగ్గ‌రైంది. ఎంత‌లా అంటే ఒకరిని విడిచి ఒక‌రు ఉండ లేరేమో అనే అంత‌. ఓ సారి మోనాల్, కుమార్ సాయిల‌లో ఒక‌రు ఎలిమినేట్ అవుతార‌ని నాగార్జున ప్ర‌క‌టించ‌గానే అఖిల్ క‌న్నీటినుండి జ‌లధార ప్ర‌వ‌హించింది. చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. బిగ్ బాస్ పుణ్య‌మా అని ఆమె తిరిగి రావ‌డంతో ఇద్ద‌రు కౌగిలిలో మునిగిపోయి ప్ర‌పంచాన్నే మ‌రిచిపోయారు.

అయితే మొన్న‌టి వ‌ర‌కు ఎంతో క్లోజ్‌గా ఉన్న‌ అఖిల్‌, మోనాల్‌లు ఇప్పుడు ఆమ‌డ దూరం ఉంటున్నారు. త‌న‌కి, సోహైల్‌కి మ‌ధ్య అపార్ధాలు రావ‌డానికి కార‌ణం మోనాల్ అని భావించిన అఖిల్ ఆమెని ఏకంగా నామినేట్ చేశాడు. ఈ విష‌యంలో ఇంటి స‌భ్యులతో పాటు ప్రేక్ష‌కులు చాలా ఆశ్చ‌ర్య‌పోయారు . ప్ర‌స్తుతం అఖిల్ ఎక్కువ‌గా అభిజిత్ గ్యాంగ్‌తో క‌లిసి ఉంటుండ‌గా, మోనాల్ మాత్రం ఏకాకి అయింది. అఖిల్ తో ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా అంద‌రి దృష్టిలో ప‌డ్డ ఈ అమ్మ‌డు అసలు కంటికే క‌నిపించ‌డం లేదు. దీంతో మోనాల్ హౌజ్‌లో ఉండాల్సిన అవ‌స‌రం అంత లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే త‌న ద‌త్త‌పుత్రిక‌ని చాలా సార్లు కాపాడిన బిగ్ బాస్ ఇంకాన్నాళ్ళు సేవ్ చేస్తారో చూడాలి.

- Advertisement -

Related Posts

ఇంత అనుభవం పెట్టుకొని చంద్రబాబు ఇలాంటి తప్పు చేశాడేంటి?? టీడీపీ నాయకులే తల పట్టుకున్నారు

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అందరికి తెలుసు. దాదాపు పతనావస్థకు చేరువలో ఉంది. ఇంకొన్నాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగు అయ్యే అవకాశం ఉన్న సందర్భంలో...

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

Latest News