మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరపై ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు భద్రాచలం దేవస్థానంపై. గతంలో భద్రాచలం ఆంధ్ర ప్రదేశ్‌లోనే వుండేదనీ, దాన్ని ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో కలిపి, ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత తెలంగాణకి ఇచ్చేశారని పేర్ని నాని ఆరోపించారు.
అనూహ్యంగా వచ్చిన వరదలతో తెలంగాణలోని భద్రాచలంతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోనూ చాలా చోట్ల ముంపు చోటు చేసుకుందనీ, దీనికి పోలవరం ప్రాజెక్టు కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని పేర్ని నాని అన్నారు.
భద్రాచలం ఏపీకి ఇచ్చెయ్యాలన్న పేర్ని నాని.. భద్రాచలం మీద తెలంగాణ ప్రభుత్వం సవతి ప్రేమ చూపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు పేర్ని నాని. యాదాద్రిని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, భద్రాద్రిని ఎందుకు నిర్లక్ష్యం చేసిందని పేర్ని నాని ప్రశ్నించారు.
‘భద్రాద్రిని మీరు అభివృద్ధి చేయలేకపోతే, దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చెయ్యండి.. మేం ఆ దేవస్థానాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం..’ అని పేర్ని నాని తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. సవాల్ విసరడం వరకూ బాగానే వుందిగానీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమయ్యింది.? రాజధానినే అభివృద్ధి చేసుకోలేని ఆంధ్రప్రదేశ్‌కి భద్రాద్రి కావాలా.? అని తెలంగాణ నేతలు ప్రశ్నిస్తున్నారు.