AP housing scheme: జగన్ నవరత్నాలలోని ‘ఇళ్ల పథకానికి’ జర్మనీ బ్యాంక్ చేయూత

Germany’s KfW bank has offered financial support for energy-efficient systems in the AP government’s Housing scheme

AP housing scheme: ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో ఒకటైన పేదలందరికీ ఇల్లు పథకానికి జర్మనీకి చెందిన ప్రభుత్వ యాజమాన్య KFW బ్యాంక్ చేయూత అందించనుంది. AP ప్రభుత్వ గృహనిర్మాణ కార్యక్రమంలో ఇంధన-సమర్థవంతమైన వ్యవస్థలకు ఈ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆ నిర్మాణాలకి 150 మిలియన్ల యూరోలను మరియు సాంకేతిక సహాయం కోసం 2 మిలియన్ల యూరోల వరకు అందజేస్తుందని తెలుస్తుంది.

ఆర్థిక మరియు సాంకేతిక సహకారం, ఉత్తమ అభ్యాసాల భాగస్వామ్యం మరియు గృహ సిబ్బంది, ఇంజనీర్లు మరియు గృహ లబ్ధిదారులకు శిక్షణ కోసం నిపుణులను అందించడంపై KfW, AP హౌసింగ్ విభాగం మరియు AP రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ (APSECM) మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలు జరిగాయి. ఈ మేరకు KfW యొక్క ఎనర్జీ ఎఫిషియెన్సీ హెడ్, డాక్టర్ మార్టిన్ లక్స్, AP హౌసింగ్ విభాగానికి తన మద్దతు, హామీ ఇచ్చారు.

ఏపీ హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, హౌసింగ్ స్కీమ్‌ లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపినందుకు KfW కి కృతజ్ఞతలు తెలుపుతూ, రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందని చెప్పారు. దాదాపు 10.72 లక్షల ఇళ్ల పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం రెండు దశల్లో 28.3 లక్షల ఇళ్లలో ఇంధన సామర్థ్య చర్యలను ప్రవేశపెడుతుందని, దీని కింద గృహనిర్మాణ శాఖ ప్రతి ఇంటికి నాలుగు ఎల్‌ఇడి బల్బులు, రెండు ఎల్‌ఇడి ట్యూబ్ లైట్లు మరియు ఇంధన బిల్లులను ఆదా చేయడానికి రెండు ఎనర్జీ ఎఫెక్టివ్ ఫ్యాన్‌ లను సరఫరా చేస్తుందని అజయ్ జైన్ చెప్పారు.