టీడీపీ రెబల్ ఎంపీ వల్లభనేని వంశీ రాజీనామా చేసి వైసీపీ తరుపున పోటీ చేస్తే? గెలుపు ఖాయమనే మీడియా కథనాలు వేడెక్కించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసిన వంశీ అటుపై చంద్రబాబు నాయుడితో పొసగకపో వడంతో వైసీపీ కి మద్ధతిచ్చిన నాటి నుంచి…ఒకవేళ ఉప ఎన్నిక వచ్చి వైసీపీ తరుపున టిక్కెట్ ఇస్తే ప్యాన్ గాలే వీస్తుందని పచ్చ మీడియా సైతం అనమానం వ్యక్తం చేసిందంటే? గన్నవరంలో వంశీ రాజకీయాలు ఎంత బలంగా ఉన్నాయో అర్ధమైనట్లే అర్ధమైంది.
కానీ అక్కడ సీన్ పూర్తిగా వంశీకి రివర్స్ లోనే ఉందని తాజాగా ఓ సర్వేలో తేలిందిట. వంశీ పోటీ చేస్తే గెలిచే పరపరిస్థితి లేదని సదరు సర్వే లెక్కలు చెబుతున్నాయి. గన్నవరం వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరూ కూడా వంశీ వైసీపీలోకి జంప్ చేసినా ఓట్లేసే పరిస్థితి లేదంటున్నారు. వంశీతో పాటు టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయ్యే వారు ఎవరైనా ఉన్నారా? అంటే ఆనంబర్ కూడా వేళ్లపైనే లెక్కేసుకునేలా ఉందంటున్నారు. టీడీపీ నుంచి ఎలాంటి అభ్యర్ధిని నిలబెట్టినా 54 శాతం ఓట్లు ఆ పార్టీకే పడతాయని సర్వే చెబుతోంది. మరి వంశీ పై ఇంత వ్యతిరేకత దేనికంటే? స‌్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేయడం చేటు గా మారిందన్న వాదన వినిపిస్తోంది.
గన్నవరం అంటే మొదటి నుంచి టీడీపీ కంచుకోట. కమ్మసామాజిక వర్గం అధికం గల నియోజక వర్గం. కానీ జగన్ రాకతో ఆ సీన్ కాస్త మారింది. దుట్టా రాచంద్రరరావు లాంటి నేతలు వైసీపికి అక్కడ బలమైన పునాదులు వేసారు. స్థానికంగా టీడీపీని ధీటుగా ఎదుర్కునే శక్తిని కూడగట్టుకున్నారు. అయితే వల్లభనేని వంశీ వైసీపీలోకి వస్తున్నారని..ఉప ఎన్నిక వస్తే వంశీకే టిక్కెట్ కేటాయిస్తారని వచ్చిన కథనాలపై దుట్టా వర్గీయులు ధీటుగా స్పందించి తమ బలం ఏంటో నిరూపించుకున్నారు. ఇంతలోనే వంశీ సైతం ఊహించని విధంగా సీన్ రివర్స్ లో ఉందని తాజా కథనమే చెబుతోంది.