స‌లార్ గుట్టు విప్పిన సంగీత ద‌ర్శ‌కుడు.. వైర‌ల్‌గా మారిన వార్త‌

కేజీఎఫ్ చిత్ర ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం స‌లార్. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శృతి హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. మధూ గురుస్వామి విల‌న్‌గా న‌టిస్తున్న‌ట్టు టాక్. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ రామగుండంలో ప్రారంభించారు. ప్ర‌భాస్‌పై కొన్ని కీల‌క సన్నివేశాలు చిత్రీక‌రించిన త‌ర్వాత మిగ‌తా ఆర్టిస్టుల‌పై ముఖ్య‌మైన స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్టు టాక్. ఇటీవ‌ల జరిగిన షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్‌తో పాటు మరికొందరు కీలకమైన నటీనటులు కూడా పాల్గొన్నారు. సలార్ తొలి షెడ్యూల్ పూర్తైపోయినట్లు ఇటీవ‌ల అఫీషియ‌ల్‌గా ప్ర‌కటించాడు ప్ర‌శాంత్ నీల్.

 

ఫిబ్రవరి మూడో వారంలో రెండో షెడ్యూల్ మొదలు కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ వ‌ర‌కు పూర్తి చేయాల‌ని ప్ర‌శాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడ‌ట‌. అక్టోబ‌ర్‌కు ఈ సినిమా పూర్తైతే వెంట‌నే ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయాల‌ని భావిస్తున్నాడు ప్ర‌శాంత్ నీల్. మ‌రో వైపు ప్ర‌భాస్.. ఆదిపురుష్, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న పీరియాడిక‌ల్ మూవీస్‌తో బిజీగా ఉన్నాడు. అయితే ప్ర‌శాంత్ నీల్‌- ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న స‌లార్ మూవీ గురించి కొన్నాళ్ళుగా ఆస‌క్తిక‌ర వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

స‌లార్ చిత్రం రీమేక్ అంటూ వ‌చ్చిన వార్త‌ల‌ను గ‌తంలో ఖండించారు ప్ర‌శాంత్ నీల్. అయితే తాజాగా స‌లార్ సినిమాకు సంగీతం అందిస్తున్న ర‌వి భాస్క‌ర్ పూర్తి క్లారిటీ ఇచ్చారు. క‌న్న‌డ ఛానెల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చిన ఆయ‌న .. స‌లార్ సినిమా గ‌తంలో ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించిన ఉగ్ర‌మ్‌కు రీమేక్ అనే సంగతి తెలిసిందే కదా అని స్ప‌ష్టం చేశాడు. ఆయ‌న ప్ర‌క‌ట‌నతో అంద‌రిలో స‌లార్ సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది అయితే ఇప్పుడు సంగీత ద‌ర్శ‌కుడు మాట్లాడిన క్లిప్పింగ్ సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. అంటే ఇప్పుడు స‌లార్ సినిమా ఒక రీమేక్ అని అర్ద‌మైంది.