Weight loss: బరువు తగ్గాలా..? ఈ పండ్లు తినాలనిపిస్తుందా.. కానీ తినకూడదు..!!

Weight loss: అధిక బరువు ఈరోజుల్లో చాలామందికి పెద్ద సమస్య. బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం, అన్నం తగ్గించుకోవడం, చపాతి, పుల్కా, ఫ్రూట్స్, రకరకాల డైట్స్.. తింటూ బరువు తగ్గేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. బరువు తగ్గే క్రమంలో కొన్ని రకాల ఫ్రూట్స్ తినడం వల్ల ఉపయోగం ఉండదని.. అసలు తినొద్దని చెప్తున్నారు ఆహార నిపుణులు. ముఖ్యంగా కొన్ని రకలా పండ్లు తినడం వల్ల బరువు మరింతగా పెరిగే అవకాశమే ఉందంటున్నారు.

మామిడిపండు సీజనల్ గా లభ్యమవుతుంది. మామిడిని ఇష్టపడని వారు.. తిననివారు అరుదుగానే ఉంటారు. వీరితోపాటు బరువు తగ్గాలనుకునేవారు చేరిపోవడం బెటర్. కప్పు మామిడి జ్యూస్, ముక్కల్లో 99 కేలరీలు ఉంటాయి. ఇందులో 23 గ్రామలు చక్కెర, 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇవి కూడా బరువు పెరిగేందుకు సాయపడతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ పండ్లు తినడం మానేయడం ఇష్టం లేకపోయినా కష్టంగా మానేయాల్సిందే.

డైటింగ్ చేసేటప్పుడు ఏ ఆహారం తీసుకోవాలో వద్దో.. కూడా ఖచ్చితంగా తెలియాల్సిందే. ఈక్రమంలో బరువు తగ్గేందుకు తినకూడని పండ్లలో అరటి పండు ఒకటి. ఇది చాలా బలమైన ఆహారం అనేది తెలిసిందే. కానీ.. బరువు తగ్గాలనుకుంటే మీ డైట్ లో అరటిపండు ఉండకూడదు. ఇందులో పుష్కలంగా ఉండే కేలరీలే అందుకు కారణం. అరటిపండులో ఉండే 150 కేలరీలు సుమారు 37.5 గ్రాముల కార్బోహైడ్రేట్స్ కు సమానం. ఆరోగ్యాన్నిస్తుంది కదా అని.. రోజుకు 2-3 అరటిపండ్లు తింటే మీ బరువును పెంచేస్తుంది.

ద్రాక్ష పండ్లలో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల ద్రాక్షలో 67 కేలరీలు, 16 గ్రాముల చక్కెర ఉంటాయి. వీటిని కూడా రెగ్యులర్ గా తింటే బరువు పెరిగే అవకాశమే ఎక్కువ. ద్రాక్షలో కంటే ఎండుద్రాక్షలో ఒక గ్రాము ఎక్కువ కేలరీలే ఉంటాయి.  కప్పు ఎండుద్రాక్షలో ఉండే 500 కేలరీలు మీ బరువును పెంచేవే. అవకాడోలో కూడా అధిక కేలరీలు ఉంటాయి. 100 గ్రాముల పండ్లలో 160 కేలరీలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. అయితే.. బరువు పెరిగేందుకు ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి.. బరువు తగ్గాలనుకునే మీ లక్ష్యానికి ఈ పండ్లు అవరోధం కాకుండా చూసుకోవాల్సిందే మరి.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.