మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఆత్మహత్య

మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కుమార్తె తాటి మహాలక్ష్మి(26) ఆత్మహత్య చేసుకున్నారు. బూర్గంపాడు మండలం సారపాకలోని ఆమె నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణాలు తెలియరాలేదు. కూతురి మరణవార్త విని వెంకటేశ్వర్లు షాక్ తిన్నారు. దీంతో హుటాహుటిన దమ్మపేటలో ఆయన సారపాక చేరుకొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన బూర్గంపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.