ప్రీతి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్… ఆత్మహత్యకు వేదింపులు మాత్రమే కారణం కాదు..?

కేఎంసీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసు ఇప్పుడు సంచనంగ మారింది. ఎంబిబిఎస్ పూర్తి చేసుకుని బిజీ చేస్తున్న ప్రతి సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం రేపింది. ఆమె మృతి పట్ల విద్యార్థి సంఘాలు గిరిజన సంఘాలు నిరసనలకు దిగాయి. సోమవారం రోజున కట్టుదిట్టమైన భద్రత చర్యల మధ్య ప్రీతి అంత్యక్రియలు ముగుసాయి. ఆమె ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ప్రీతి ఆత్మహత్య కేసులో మరొక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

ప్రీతి ఆత్మహత్య చేసుకోవడానికి సీనియర్ వేదింపులే కాకుండా రూ.50 లక్షల అడ్మిషన్‌ బాండ్‌ కూడా ఈ అఘాయిత్యానికి కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఎంబిబిఎస్ పూర్తి చేసిన తర్వాత పీజీ సీటు వచ్చిన సమయంలో అడ్మిషన్‌ బాండ్‌ రూ.50 లక్షల అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. విద్యార్థి పీజీ కోసం అడ్మిషన్‌ తీసుకున్నాక ఏ కారణం వల్లైన కోర్సు మధ్యలో డ్రాప్‌ అయితే ఆ మొత్తం తిరిగి కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీకి చెల్లించాలి. ఇదే ఇప్పుడు ప్రీతి పాలిట శాపమైందన్న వాదన తెరపైకి వచ్చింది. సీనియర్ విద్యార్థి వేధింపులు భరించలేక మధ్యలో తన పీజీ కోర్స్ ఆపేయాలని అనుకున్నా కూడా 50 లక్షల రూపాయలు జరిమానా చెల్లించటానికి ప్రీతీ ఆలోచించి.

సైఫ్‌ నుంచి వేధింపులు ఎక్కువవడంతో పీజీ కోర్సు ఆపేసి రమ్మని తండ్రి నరేందర్‌ కోరగా.. కోర్స్ మధ్యలో ఆపేస్తే రూ.50 లక్షలు జరిమానా వర్సిటీకి చెల్లించాల్సి ఉంటుంది. అంత మొత్తం ఎలా అడ్జస్ట్‌ చేస్తావు అని ఆమె తన తండ్రీ తో చెప్పినట్లు చర్చ జరుగుతోంది. సైఫ్ వేధింపులు తట్టుకోలేక మధ్యలో డ్రాప్‌ అయితే అంత మొత్తం జరిమానా కట్టే స్థితిలో తన తండ్రి లేడని ప్రీతి ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుదన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వేధింపులు, ర్యాగింగ్‌లపై ప్రభుత్వం కొత్త అడ్మిషన్‌ బాండ్‌ నిబంధనలు తీసుకురావాలని, లేదా విద్యార్థినులకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తన్నాయి.