R.K.Roja: సినీ నటి వైసిపి మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె రాజకీయాలకు సంబంధించిన విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఈమె మంత్రిగా ఉన్న సమయంలో తరచూ తిరుమలకు వెళ్లేవారు అయితే విఐపి దర్శనం అంటూ పెద్ద ఎత్తున టికెట్లను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు అంటూ తన పట్ల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై రోజా స్పందించారు.
తాను సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా వారిని స్వయంగా తానే దర్శనానికి తీసుకెళ్లి దేవుడి దర్శనం చేయించాను. అయితే నేను ఒకరి దగ్గర కూడా రూపాయి ఆశించలేదు. నేను డబ్బు తీసుకున్నానేమో ఎవరినైనా చెప్పమనండి.. జబర్దస్త్ లో పని చేసే ప్రతి ఒక్కరూ కూడా దర్శనానికి వచ్చారు. వాళ్లు తిరుపతికి వచ్చేలోపు రూమ్స్ బుక్ చేయించి వారికి దర్శనం చేయించి తిరిగి వాళ్ళు వెళ్లే వరకు అన్ని బాధ్యతలు నేనే చూసుకున్నాను. ఇలా వచ్చిన వారందరిని కంఫర్ట్ జోన్ లో పెట్టాను. అలా కంఫర్ట్ జోన్ లో ఉన్న ఒకడు ఇప్పుడు నాపై బురద చల్లుతున్నారు. వాడిని దేవుడు కచ్చితంగా శిక్షిస్తాడు అంటూ రోజా ఆర్పీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను ఒక్క షో చేస్తే నాకు లక్షలలో రెమ్యూనరేషన్ ఉంటుంది అలాంటిది టికెట్లు నేనెందుకు అమ్ముకుంటాను. ఈ విషయాన్ని నేను నిర్మహమాటంగా, ఎక్కడైనా ప్రమాణం చేసి చెప్పమన్నా చెబుతాను అంటూ రోజా తెలిపారు. ఈ క్రమంలోనే యాంకర్ ఇక్కడే ప్రమాణం చేయండి అంటూ చెప్పగా రోజా ఏడుకొండల స్వామి సాక్షిగా తాను టికెట్లు అమ్ముకోలేదు అంటూ ఈమె దేవుడిపై ప్రమాణం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఆర్పి రాజకీయాల పరంగా రోజాను టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడటమే కాకుండా మహిళ అని కూడా చూడకుండా తనని కించపరుస్తూ మాట్లాడుతున్న నేపథ్యంలో రోజా ఈ విధంగా స్పందించారని తెలుస్తోంది.