అన్ని రాష్ట్రాల రాజకీయాలు వేరు.. ఏపీ రాజకీయాలు వేరు. ఏపీలో ప్రస్తుతం కొందరి పరిస్థితి ఎలా ఉందంటూ.. ఏటూ కాకుండా ఉంది. కక్కలేక మింగలేక అన్నట్టుగా ఉంది. ఏదో కోపంతో ఏదో చేయబోతే.. ఏదో అయినట్టుగా ఉంది వాళ్ల పరిస్థితి. కుడితిలో పడ్డ ఎలుక ఏం చేయగలుగుతుంది. అలాంటి వాళ్లలో మాజీ సీఎస్ ఐవైఆర్ సుబ్రమణ్యం ఒకరు.
ఆయన నిజానికి బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. 2019 ఎన్నికల ముందు ఐవైఆర్ కు జగన్ అంటే ఎంతో అభిమానం ఉండేది. అయితే.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ఆయనకు జీర్ణం కావడం లేదట.
పోనీ.. గట్టిగా అడుగుదామా అంటే అడగలేడు. ఎందుకంటే.. ఏపీ సీఎం జగన్ 2019 ఎన్నికల్లో గెలవడానికి పరోక్షంగా ఆయన కూడా కారణమే. కానీ.. ఏపీ పరిస్థితులను చూస్తుంటే తప్పట్లేదు. జగన్ ను ఎంతగా అభిమానించినా.. ఇక తప్పదు అనుకొని.. అంతర్వేది ఘటనపై ఐవైఆర్.. జగన్ కు 7 డిమాండ్లను సమర్పించారు.
నిజానికి అవి డిమాండ్లు కాదు లేండి.. సలహాలు అంటే బెటర్. అంటే.. ఎలా చేయాలి.. ఏం చేస్తే బాగుంటుంది..అన్నట్టుగా కొన్ని సలహాలను అందించారు.
బాబ్బాబు.. ఈ ఏడు సలహాలను కాస్త పట్టించుకొని ఆచరించండి.. అప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదు.. ఏపీ ప్రజల్లో దేవుడిగా నిలిచిపోతారు.. అన్నంతగా జగన్ ను ఐవైఆర్ రిక్వెస్ట్ చేశారు.
ఇంతకీ ఆ ఏడు సలహాలు ఏంటో మీరే చూడండి..
- హిందూ మత సంస్థల నుండి అన్యమతస్తులను తొలగించాలి
- వెంటనే ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేయాలి. అంతే కాదు.. ఆలయాల్లోని ధార్మిక సిబ్బందిని పరిషత్ పరిధిలోకి తీసుకురావాలి.
- ధార్మిక పరిషత్ కే దేవాలయాల నిర్వహణ కమిటీల నియామకాన్ని అప్పజెప్పాలి.
- దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు ఒక అధికారిని నియమించాలి. ఆ అధికారి కార్యాచరణను రూపొందించి.. వాటిని అమలు చేసే చిత్తశుద్ధిని కలిగి ఉండాలి.
- హిందూ మత ప్రచారానికి కూడా కార్యాచరణ రూపొందించాలి. ఆలయాల ద్వారా వచ్చే ఆదాయాన్నే హిందూ మత ప్రచారానికి ఉపయోగించాలి.
- నిర్వహణ ఖర్చులు తగ్గించాలి..దాని కోసం లౌకిక సిబ్బందిని ఆలయాల్లో తగ్గించాలి.
- పరమత ద్వేషాన్ని రెచ్చగొట్టడం తీవ్రనేరంగా పరిగణించాలి.. మత ప్రచారాల్లో అటువంటి పనులు చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి..
చదివారుగా.. ఇది అమలు అయ్యే పనులేనా? ఐవైఆర్ బాగానే కష్టపడి ఈ సలహాలు జగన్ చెప్పినా.. ఆయన వింటారా? విన్నా వీటిని అమలు చేస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.