సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో భారీ అగ్ని ప్రమాదం !

కరోనా వ్యాక్సిన్‌ తయారు చేస్తున్న సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పూణేలోని సీరం సంస్థ మాంజ్రీ ప్లాంట్‌లోని టెర్మినల్-1 గేట్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనితో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది.

Fire breaks out at Serum Institute of India's plant in Pune, fire tenders rushed to the spot

భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు పది అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ విషయాన్ని పూణె మేయర్ మురళీధర్ మోహల్ తెలిపారు. మొదట్లో ఐదు అగ్ని మాపక యంత్రాలు మాత్రమే చేరుకున్నాయి. మంటలు అదుపు కాకపోవడంతో అధికారులు మరో ఐదు అగ్ని మాపక యంత్రాలను రప్పించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రా జెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ‌ను సీరం భారీ ఎత్తున తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోవీషీల్డ్‌ టీకాలు ప్రమాదం జరినగిన ఈ ప్లాంట్ ‌లో తయారుకావడం లేదని తెలుస్తుంది.