ఫైర్ బ్రాండ్ రోజాకి మంత్రి పదవి దక్కేనా.? లేదంటే.!

Fire Brand Roja To Get Minister Post.?
Fire Brand Roja To Get Minister Post.?
ఫైర్ బ్రాండ్ రోజాకి, వైఎస్ జగన్ తొలి మంత్రి వర్గంలో చోటు దక్కించుకుంటారని అంతా అనుకున్నారు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర శాఖ మహిళా అధ్యక్షురాలిగా ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో పని చేసినా, ఎమ్మెల్యే అవలేకపోయారామె. సొంత పార్టీలో రాజకీయాలే ఆమెను టీడీపీలో తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఎమ్మెల్సీ అవకాశం వచ్చినా అప్పట్లో రోజా ఒప్పుకోలేదు. ఎమ్మెల్యేగానే అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనుకున్నారు రోజా.
 
ఆ కోరిక వైఎస్సార్సీపీ ద్వారా తీర్చుకున్నారామె. అయితే, వైసీపీ ద్వారా ఎమ్మెల్యే అయినా, సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ నేతల రాజకీయాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది ఫైర్ బ్రాండ్ రోజాకి. సామాజిక వర్గ సమీకరణాల్ని సాకుగా చూపి, రోజాకి తొలి మంత్రి వర్గంలో అవకాశమివ్వలేదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అందుకు బదులుగా ఏపీఐఐసీ ఛైర్ పర్సన్‌గా అవకాశం దక్కిందామెకి.
 
కానీ, ఏం లాభం.? ఇప్పుడు ఆ పదవి కూడా పోయింది. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో రోజా, ఆ పదవిని దూరం చేసుకోవాల్సి వచ్చింది. అయితే, ఇదంతా మెరుగైన పదవి దక్కడం కోసమేనన్న ప్రచారం జరుగుతోంది. ఆ మెరుగైన పదవి ఇంకోటేదో కాదు, మంత్రి పదవి.. అని అంటున్నారు ఎమ్మెల్యే రోజా అభిమానులు. కానీ, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మాత్రం రోజా పట్ల పూర్తి నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారట వైసీపీ మద్దతుదారులు.
 
జిల్లాకి చెందిన వైసీపీ కీలక నేతలు, రోజాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి అన్నది రోజా మద్దతుదారుల ఆవేదనగా కనిపిస్తోంది. ఒకవేళ మంత్రి పదవి గనుక రోజాకి దక్కకపోతే, ఉద్దేశ్యపూర్వకంగా ఆమెపై వైసీపీలో ‘దాడి’ జరుగుతోందనే విషయం స్పష్టమవుతుందని వారంటున్నారు. ఏమో, ఏం జరుగుతుందో.. మంత్రి పదవి దక్కుతుందా.? దక్కితే ప్రాధాన్యత గల పోర్ట్ ఫోలియో దక్కుతుందా.? లేదంటే, అప్రాధాన్య శాఖ ద్కుతుందా.? మంత్రి పదవే దక్కకపోతే, రోజా భవిష్యత్ రాజకీయ ప్రణాళిక ఎలా వుండబోతోంది.? వేచి చూడాల్సిందే.