Shyamala – Roja: శ్యామల పందిపిల్ల… రోజా బర్రె పిల్ల అంటూ రెచ్చిపోయిన గబ్బర్ సింగ్ కమెడియన్?

Shyamala – Roja: పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా యాక్షన్ పీరియాడిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నో అంచనాలు నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో కాస్త వెనుకబడిందని చెప్పాలి. ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కూడా నెగిటివిటీ వస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కచ్చితంగా పవన్ కళ్యాణ్ సినిమాని వైసీపీ టార్గెట్ చేస్తూ ఇలాంటి నెగెటివిటీని ప్రచారం చేయిస్తున్నారంటూ మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే గబ్బర్ సింగ్ సినిమా కమెడియన్ బ్యాచ్ లో ఒకరైన సాయిబాబా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసిపి మహిళా నేతలు అయిన యాంకర్ శ్యామల సినీనటి రోజాపై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ…యాంకర్ శ్యామలను “పందిపిల్ల”, మాజీ మంత్రి రోజాను “బర్రెపిల్ల” అంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ గురించి ఇటీవల రోజా శ్యామల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అయితే వీరికి హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ ఒక చెంప దెబ్బ లాంటిది, చెప్పు దెబ్బ లాంటిది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ సినిమాలు చేయడమే తప్ప, వేరే బిజినెస్‌లు చేయడం లేదని సాయి బాబా పేర్కొన్నారు. మరొకవైపు, రోజా తిరుమలలో టికెట్లు అమ్ముకొని కోట్లు సంపాదించిందని ఆరోపించారు. హరిహర వీరమల్లు సినిమాకు వస్తున్న రెస్పాన్స్ తనను ఎంతో ఆనందపరచిందని అన్నారు. ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రోజా గురించి యాంకర్ శ్యామల గురించి ఈయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈయన వ్యాఖ్యలకు అనుగుణంగానే ఘాటుగా సమాధానం ఇస్తున్నారు.