చివరికి కేసీఆరే జగన్ దారిలోకి వచ్చారుగా 

Finally KCR tooks YS Jagan's path
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన పాలనను పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనతో పోల్చిచూడటం మొదలుపెట్టారు  చాలామంది.  ఈ పోలికలో కేసీఆర్ మీద ప్రశంసలు, జగన్ మీద విమర్శలు గుప్పుమన్నాయి.  అనుభవం కలిగిన కేసీఆర్ పాలన ముందు, రాజకీయ వైఖరి ముందు జగన్ తేలిపోతున్నారని అనేవారు ఎక్కువయ్యారు.  ముఖ్యంగా కేంద్రం విషయంలో  జగన్ కంటే కేసీఆర్ భేష్ అని, బీజేపీ ప్రభుత్వాన్ని కేసీఆర్ గడగడలాడిస్తున్నారని చెప్పేవారు.  పైకి సీన్ అలానే కనబడేది.  కేసీఆర్ బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని పెద్దగా లెక్కచేసేవారు కాదు.  అసలు ఆయన ఢిల్లీ వెళ్లడమే అరుదు.  ఇంకోవైపు జగన్ తరచూ ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలతో సమావేశాలు జరిపేవారు.  ఎన్నిసార్లు వెళ్లినా ఆయన ఒట్టిచేతుల్తో వస్తుండటంతో తన కేసుల విషయం మీనే జగన్ కేంద్రం పెద్దల వెద్దకు వెళ్లారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని ఎద్దేవా చేసేవారు.  
Finally KCR tooks YS Jagan's path
Finally KCR tooks YS Jagan’s path
 
ఇక కేంద్రం ప్రవేశపెట్టే ప్రతి బిల్లుకు జగన్ బేషరతుగా మద్దతిచ్చేసేవారు.  కానీ కేసీఆర్ మాత్రం ఎదురుచెప్పేవారు.  కేంద్రం నిర్ణయాలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని ఒక మోస్తరుగా అయినా తన రాజ్యసభ సభ్యుల చేత చెప్పించేవారు.  ఇలా కేంద్రం విషయంలో జగన్ పూర్తిగా లొంగిపోయి వ్యవహరిస్తే కేసీఆర్ రొమ్మువిరిచి నడుస్తున్నారని చెప్పేవారు.  కానీ కొన్ని నెలల్లోనే సీన్ తారుమారైంది.  మొదటి నుండి జగన్ ఏ పద్దతిలో అయితే వెళుతున్నారో ఇప్పుడూ అదే పద్ధతిలో ఉండగా కేసీఆర్ మారిపోయారు.  మారాల్సిన పరిస్థితులు వచ్చాయి ఆయనకు.  రాష్ట్రంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో కేసీఆర్ హుటాహుటిన ఢిల్లీ మోదీ, అమిత్ షాలను కలిశారు.  ఆ మీటింగ్ తర్వాత కేసీఆర్ వైఖరి మారిపోయింది.  
 
అప్పటివరకు కేంద్రం ప్రతిపాదించిన కొత్త వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని, అన్ని పార్టీలను కూడగట్టి వాటి మీద యుధం చేస్తానని, మోటార్లకు మీటర్లు బిగించేది లేదని విసుర్లు విసిరారు.  హరీష్ రావు అయితే జగన్ కేంద్రం నుండి వచ్చే డబ్బుకు ఆశపడి ఏపీలో రైతుల ఉచిత కరెంట్ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని, కానీ తెలంగాణలో అలా జరగదని గొప్పగా చెప్పుకున్నారు.  కానీ ఈరోజు కేసీఆర్ నేరుగా చెప్పకపోయినా కేంద్రం నిర్ణయాలను మెల్లగా సమర్దించడం స్టార్ట్ చేశారు.  నియంత్రిత సాగును ఎత్తివేస్తున్నామని, రైతులు గిరాకీ ఉన్న పంటనే పండించుకోవచ్చని, అలాగే ఇకపై ధాన్యాన్ని  కొనుగోలుచేయడం జరగదని అన్నారు.  అంటే రైతులే దేశంలో ఎక్కడికైనా వెళ్లి సరుకును అమ్ముకోవచ్చని అర్థం.  ఈ మాటలను సరిగ్గా పరిశీలిస్తే ఒకే దేశం ఒకే మార్కెట్ అనే బీజేపీ విధానాన్ని ఒప్పుకోవడమేఅనిపిస్తుంది.  
 
రైట్ల పోరాటానికి తెలంగాణలో తెరాస బంద్ పాటించింది.  కానీ ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ రైతులకు మద్దతు ఇవ్వలేదు.  కనీసం వ్యవసాయం చట్టాల గురించి మాట్లాడకుండా వచ్చేశారు.  ఈ పనులన్నీ వైఎస్ జగన్ ఎప్పటి నుండో చేస్తున్నారు.  అందుకే కేంద్రంతో సున్నం లేకుండా ఉన్నారు.  కేసీఆర్ ను చూసి జగన్ మీద విసుర్లు విసిరిన వారంతా ఈనాడు కేసీఆర్ సైతం జగన్ పంథాలోకి రావడం, కేంద్రం వైఖరికి అనుకూలంగా మారుతుండటం చూసి ఇదేదో జగన్ చేసినట్టు ముందే చేసి ఉంటే పోయేది కదా.  ఇంత షో ఎందుకు, ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం కాకపోతే అంటూ నిట్టూర్పు వ్యక్తం చేస్తున్నారు.