ప్రస్తుత జనరేషన్ లో విద్యార్థులు చిన్న చిన్న వాటికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, చదివిన చదువుకు ఉద్యోగం రాలేదని,తల్లిదండ్రులు మందలించారని, ఇలా చిన్న చిన్న కారణాలతో జీవితాలను చేతులారా నాశనం చేసుకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు అయితే ఇరవై ఏళ్ళు కూడా పూర్తి కాకముందే వారికి నిండు నూరేళ్లు నిండిపోతున్నాయి. చదువుకున్న విద్యార్థులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతుండడం ఆశ్చర్యపోవాల్సిన విషయం. ఇలాగే తాజాగా ఒక విద్యార్థి ఉద్యోగం వస్తుందో రాదో అన్న అనుమానంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక కు చెందిన 19 ఏళ్ల విద్యార్థినిపై హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయిన ఆ విద్యార్థి బీహార్ లోని ఒరాయ్ గ్రామానికి చెందినవాడు. ప్రస్తుతం ఆ విద్యార్థి బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ విద్యార్థి రాసిన ఒక సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని కారణంగా ఉద్యోగం దొరకని పరిస్థితి ఉందని, చదువు కోసం కుటుంబం తీసుకున్న రుణాలను సైతం తీర్చే స్తోమత లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఇకపోతే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇన్స్టిట్యూట్ కి కూడా సరిగ్గా వెళ్ళలేక పోతున్నాడని, అంత్యక్రియలు జరిపించాల్సిందిగా కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.
ఇక చనిపోయిన ఆ విద్యార్థి అంత్యక్రియల కోసం మృతదేహాన్ని పాట్నాకు తీసుకెళ్లడానికి ఇన్స్టిట్యూట్ సిబ్బంది, అలాగే విద్యార్థులు ప్రయత్నాలు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఇక చనిపోయిన ఆ విద్యార్థి పదవతరగతి చదువుతున్న సమయంలోనే ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులకు గురి అయ్యాడని తెలిపారు. అంతేకాకుండా అల్పాహారం కోసం తోటి విద్యార్థులు విద్యార్థిని నిద్రలేపేందుకు హాస్టల్ గదికి వెళ్లి చూడటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక ఆ ఘటన చూసి షాక్ అయిన విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ యువకుడి తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు కన్న కొడుకు మృతదేహం చూసి బోరున విలపిస్తున్నారు.