Sucide: కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబం.. ఎక్కడంటే?

Sucide: కరోనా గురించి ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది, ప్రముఖులు ప్రజలలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కరోనా బారిన పడినవారు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మహమ్మారి నుంచి బయట పడవచ్చని అవగాహన చర్యలు చేపట్టినప్పటికీ కొంతమందిలో మాత్రం ఈ మహమ్మారి భయం తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ చివరికి ఆత్మహత్య చేసుకునేలా చేస్తుంది. ఈ క్రమంలోనే తమిళనాడులో ఓ కుటుంబం గత వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతూ కరోనా సోకింది అని భయపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

తమిళనాడులోని మధురై ఎంజీఆర్ కాలనీలో ఉంటున్న ఓ కుటుంబంలోని మహిళకు వారం క్రితం నుంచి తీవ్రమైన జ్వరంతో బాధ పడుతుంది. ఎన్ని మందులు వాడినా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. అయితే ఆమెకు తీవ్రమైన జ్వరం రావడంతో కరోనా అని భయపడింది. ఈ క్రమంలోనే ఇదే అనుమానం కుటుంబ సభ్యులలో కూడా మొదలైంది.ఇలా కరోనా అని భయపడిన ఆ కుటుంబం మనం ఎలాగో చనిపోతాం అని భావించి ముందుగానే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే కుటుంబం మొత్తం విషం కలిపిన ఆహారం తీసుకోగా వీరిలో తల్లి కొడుకులు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.