Rashmika: ఇండస్ట్రీలో సక్సెస్ రావాలంటే రాజీ పడాల్సిందే రష్మిక సంచలన వ్యాఖ్యలు?

Rashmika: సినీ నటి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల అల్లు అర్జున్ సరసన నటించిన పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సినిమా ద్వారా ఈమెకు మరింత క్రేజ్ పెరిగింది అని చెప్పాలి.

ఇక ఈ సినిమా తర్వాత ఈమె ఇదివరకు కమిట్ అయిన సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక త్వరలోనే ఈమె నటించిన బాలీవుడ్ చిత్రం ఛావా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా డిసెంబర్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రష్మిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ మంచి సక్సెస్ అందుకోవాలి అంటే కొన్ని విషయాలలో రాజీ పడాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతమున్న బిజీ షెడ్యూల్ కారణంగా వరుస షూటింగ్స్ లో పాల్గొంటూ ఉన్నానని తద్వారా తన విలువైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నాను.ఈ ప్రయాణంలో నేను రాజీపడిన అతిపెద్ద విషయం ఇదే. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలకు ఒకేసారి సమయాన్ని కేటాయించడం అంత సులభం కాదు. ఒకదాని కోసం మరొకటి త్యాగం చేయాల్సి ఉంటుంది
అంటూ రష్మిక ఆవేదన చెందారు.

తాను ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా అడుగుపెట్టిన సమయంలో ఈ విషయం మా అమ్మ నాకు చెప్పింది అంటూ తన తల్లి మాటలను గుర్తు చేసుకున్నారు. కెరియర్ పరంగా ఉండే కమిట్మెంట్స్ నిలబెట్టుకోవాలి అంటే ఫ్యామిలీ టైం త్యాగం చేయాల్సిందేనని తన తల్లి కెరియర్ మొదట్లోనే ఈ విషయాలను చెప్పారని రష్మిక వెల్లడించారు ఇక తనకు తన కుటుంబమే పెద్ద బలం అంటూ ఈమె తెలిపారు.