Jr NTR: ఫ్యామిలీతో కలిసి లండన్ లో ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. వీడియోస్ వైరల్!

Jr NTR: టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే ఇటీవలే దేవర సినీమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ యాక్షన్‌ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ.

బాలీవుడ్ నటుడు సైఫ్ ‍‍అలీఖాన్‌ కీలక పాత్ర పోషించారు. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2లో కనిపించనున్నారు. ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ‍ప్రశాంత్ నీల్‌ తో జత కట్టనున్నారు. ఈ చిత్రాన్ని పీరియాడికల్‌ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు ఇటీవల నిర్మాత ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం షూటింగు కాస్త గ్యాప్ దొరకడంతో ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ చిల్లవుతున్నారు ఎన్టీఆర్. లండన్‌లో తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు.

 

తాజాగా లండన్‌ లోని హైడ్ పార్క్‌ లో తన పిల్లలతో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫొటోస్ లో ఒక ప్రదేశంలో ఎన్టీఆర్ పిల్లలు కలిసి ఏదో ఒక పిక్చర్ ని చూస్తుండగా ప్రణతి అటువైపు తిరిగి మొబైల్ చూస్తోంది. ఇకపోతే ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం వార్ 2లో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారు.