మాస్ ప్రేక్షకులు ఆదరిస్తే సినిమా విజయం ఒకలా ఉంటుంది. క్లాస్ ఆడియన్స్ మెచ్చితే ఇంకోలా ఉంటుంది. కానీ ఫ్యామిలీ ఆడియన్స్, లేడీ ప్రేక్షకులు మెచ్చరు అంటే ఆ విజయం భారీగా ఉంటుంది. ఇదే జరుగుతోంది పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ విషయంలో. మొదటోరోజే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం తగ్గినా టికెట్ ధరలతో గండంలో పడింది. 100 కోట్ల షేర్ మార్క్ అందుకుంటే కానీ హిట్ అనిపించుకుని పరిస్థితుల్లో 5, 10, 15 టికెట్ ధరలతో కలెక్షన్ల మీద పెద్ద ప్రభావమే పడింది. దీంతో సినిమా 100 కోట్ల మార్క్ అందుకుంటుందా లేదా అనుమానం మొదలైంది.
కానీ పవన్ కళ్యాణ్ స్టామినా ముందు ఆ అడ్డంకులేవీ నిలబడలేదు. మొదటివారం ముగిసేనాటికి చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 82 కోట్ల షేర్, ప్రపంచవ్యాప్తంగా 95 కోర్టుల షేర్ అందుకుని 100 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇప్పటివరకు కేవలం పవన్ అభిమానులు, యువత మాత్రమే సినిమాను వీక్షిస్తూ రాగ ఇప్పుడు మహిళలు, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. చాలా చోట్ల మహిళల కోసం ప్రత్యేక షోలు ప్రదర్శిస్తున్నారు. చాలా థియేటర్ల వద్ద మహిళా ప్రేక్షకులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. మహిళా ప్రేక్షకుల్ని థియేటర్లకు వచ్చేలా చేసింది అంటే సినిమా హిట్ అని వందకు వంద శాతం కన్ఫర్మ్ అయినట్టే. ఈ లెక్కన ఇంకో మూడు నాలుగు రోజుల్లో పవన్ 100 కోట్ల మార్కును క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.