Vakeel Saab: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలలో అటు సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం ఈయన రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్.
డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాలీవుడ్ చిత్రం పింక్ సినిమాకి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ పాత్రలో కనిపించారు. లాయర్ గా పవన్ కళ్యాణ్ నటన అద్భుతమని చెప్పాలి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ కు ఎంతో మంచి సక్సెస్ అందించింది అయితే ఈ సినిమా విడుదలయ్యి సరిగ్గా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా తమన్ వకీల్ సాబ్ సినిమా గురించి స్పందిస్తూ…. వకీల్ సాబ్ సినిమాకు పనిచేయటం నాకు ఎంతో ప్రత్యేకం అని ఈయన తెలిపారు. నా మ్యూజిక్ కెరియర్ కు వకీల్ సాబ్ సినిమా చాలా ఉపయోగపడింది, తనకు ఇలాంటి ఒక గొప్ప అవకాశం కల్పించిన నటుడు పవన్ కళ్యాణ్ కు స్పెషల్ థాంక్స్ అంటూ తమన్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
2021లో వచ్చిన వకీల్ సాబ్.. పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చినా తన క్రేజ్ తగ్గలేదని నిరూపించింది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా.. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశారు. ముగ్గురు ఆడపిల్లలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తే.. వారికి ఒక లాయర్ గా సత్యదేవ్ ఎలా న్యాయం చేశారు అనే విధంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
