Fahad Fazil: పుష్ప 2 పై ఫహద్ సంచలన వ్యాఖ్యలు… ఫెయిల్ అయ్యాను అంటూ!

Fahad Fazil: ఫహద్ ఫాసిల్  తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈయన మలయాళ నటుడు అయినప్పటికీ ఇటీవల కాలంలో ఈయన నటించిన సినిమాలు కూడా తెలుగులో విడుదల అవుతూ ఇక్కడ కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇకపోతే తాజాగా ఫహద్ మారీశన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా పుష్ప 2 సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తి కరమైన విషయాలను వెల్లడించారు.

పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ శకావత్ అంటూ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా పేరు ప్రస్తావించకుండా ఈయన మాట్లాడుతూ గత ఏడాది తాను ఒక పెద్ద సినిమాలో నటించానని అయితే అందులో ఫెయిల్ అయ్యానని తెలిపారు. ప్రస్తుతం తాను ఆ సినిమా గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు కొన్నిసార్లు పరిస్థితులు మన చేతులలో ఉండవని అలాంటప్పుడు దానిని వదిలేసి పాఠం నేర్చుకోవాలని ఈ సందర్భంగా ఫహద్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే పుష్ప సినిమా ఈయనకు అనుకున్న స్థాయిలో పెద్దగా ఆదరణ రాలేదని చెప్పాలి. ఈ పాత్ర విషయంలో పూర్తి నిరాశలో ఉన్న ఫహద్ ప్రమోషన్లకు కూడా దూరంగా ఉన్నారు. ఇలా తన పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతోనే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతుంది. ఇక అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు పార్ట్-3 కూడా ఉండబోతున్న సంగతి తెలిసిందే. మరి ఆ సినిమాలో ఫహద్ పాత్ర ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.