బాలీవుడ్ లో బన్నీ హిస్టారికల్ రికార్డు.. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప 2..

సుకుమార్ పుష్ప సినిమాని ఏం ముహూర్తంలో స్టార్ట్ చేశాడో కానీ రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. పుష్ప 1 సాధించిన రికార్డులే ఎక్కువ అనుకుంటే పుష్ప 2 దాన్ని మించి అన్నట్టు మరిన్ని రికార్డులు కొల్లగొడుతుంది. సినిమా రిలీజ్ అవ్వటానికి ముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇంకా మరెన్నో రికార్డులు క్రియేట్ చేయటానికి సిద్ధంగా కూడా ఉంది.

ఇప్పటికే అత్యంత వేగంగా 1500 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్న భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా. తాజాగా బాలీవుడ్ అడ్డాలో ఆల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేసి హిందీ గడ్డపై ఈ మూవీ అగ్రస్థానంలో నిలిచింది. పుష్ప టు సినిమా 15వ రోజు 14 కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది దీంతో కేవలం హిందీలోనే 632.5 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి హిందీలోనే అత్యధిక కలెక్షన్స్ దక్కించుకున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

ఇప్పటివరకు టాప్ ప్లేస్ లో ఉన్న స్త్రీ 2 సినిమాని కూడా పుష్ప సినిమా వెనక్కి నెట్టేసింది డబ్బింగ్ సినిమా గా అడుగుపెట్టి బాలీవుడ్ లో ఉన్న చాలా రికార్డులని కొల్లగొట్టింది పుష్ప 2. ఈ కలెక్షన్స్ ఇక్కడితో ఆగేలాగా లేదు హిందీ వర్షన్ లో మూవీ కలెక్షన్స్ త్వరలోనే 700 కోట్లకు చేరటం పక్కాగా కనిపిస్తుంది. ఇప్పటివరకు ఏ బాలీవుడ్ హీరో ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించలేదు.

బాలీవుడ్ అడ్డాలో ఒక తెలుగువాడు ఆ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేయటం నిజంగా గ్రేట్. పుష్ప వన్ సినిమాకి మూడేళ్ల తర్వాత వచ్చిన పుష్ప టు సినిమా మరింత బ్లాక్ బస్టర్ కొట్టింది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపాన్ని చూపించారు అలాగే రష్మిక మందన్న కూడా శ్రీవల్లి పాత్రలో జీవించేసింది. ఫహద్ ఫాజిల్ నటన ఈ సినిమాకి మరో హైలెట్. ఇకమీదట ఈ సినిమా మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.