సర్వే లో తేలిన నిజాలు.. ఆమంచి వైపే జగన్ చూపు

amanchi telugurajyam

 అధికారంలో ఉన్న పార్టీలో అసంతృప్తులు, నియోజకవర్గంలో పెత్తనం లాంటి విషయాల్లో స్థానిక నేతల మధ్య గొడవలు అనేవి సహజం. కొన్ని చోట్ల వాటిని అధినేత నియంత్రించే స్థాయిలో ఉంటాయి. మరికొన్ని చోట్ల హద్దులు దాటిపోయి ఉంటాయి. అలాంటి వాటిలో ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం ఒకటి. 2014 లో గెలిచిన ఆమంచి టీడీపీలో చేరి అధికారం అనుభవించి సరిగ్గా 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి పోటీచేశాడు. అతనికి పోటీగా కరణం బలరాం ను టీడీపీ పోటీకి దించింది. ఆ ఎన్నికల్లో కరణం విజయం సాధించాడు.

amanchi balaram telugu rajyam

 

  అధికారంలో వైసీపీ ఉండటంతో ఆమంచి పట్టు కూడా నియోజకవర్గంలో పెరిగింది. ఇదే సమయంలో తన కొడుకు భవిష్యత్తు కోసమంటూ బలరాం తన కొడుకుని వైసీపీలో చేర్పించాడు. చీరాలలో ఎలాగూ తాను ఎమ్మెల్యే కాబట్టి ఆ బాధ్యతలు తనకు, అద్దంకి లో తమకు మంచి పట్టు ఉండటంతో ఆ నియోజకవర్గ ఇంచార్జి గా తన కొడుకుకి అవకాశం ఇవ్వాలని బలరాం కోరటం జరిగింది. ఇలా చేస్తే నా పరిస్థితి ఏమిటని ఆమంచి కృష్ణ మోహన్ సీఎం జగన్ ఎదుట తన గోడు విన్నవించుకున్నాడు. దీనితో జగన్ మద్యే మార్గం తనకి బాగా నమ్మకస్తుడు, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ ను రంగంలోకి దించి సర్వే చేపిస్తే, చీరాలలో ఆమంచికి మంచి పట్టుందని తెలిసింది.

Read Massive: Amitabh Bachchan is a part of Prabhas21 now

 దీనితో చీరాల ఆమంచికే వదిలేసి, మీరు అద్దంకి లేదా పర్చూరుకు వెళ్లాలని జగన్ నుండి కరణం బలరాం వర్గానికి సమాచారం వెళ్లినట్లు తెలుస్తుంది. అదే విధంగా ఒక కుటుంబం నుండి ఒక్కరికి మాత్రమే ఎమ్మెల్యే గా అవకాశం ఉంటుందని కూడా సృష్టం చేసినట్లు సమాచారం. దీనితో తమకి పట్టున్న అద్దంకిలోనే ఉండాలని కరణం భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే అద్దంకి లో బాచిన చెంచు గరటయ్య ఆయన కొడుకు కూడా వైసీపీ పార్టీని నమ్ముకొని ముందుకు నడుస్తున్నారు. కరణం కుటుంబం తిరిగి అద్దంకి కి రావటంతో వాళ్ళకి ఇబ్బందులు తప్పేలా లేవు. వీటికి ఉన్న ఒకే ఒక్క పరిష్కారం ఏమిటంటే, చీరాల ఆమంచికి వదిలేసి, అద్దంకి బాచిన కుటుంబానికి వదిలేసి, పర్చూరు మీద కరణం దృష్టి సాధిస్తే మంచిదని వైసీపీ అధిష్టానం భావిస్తుంది, కానీ కరణం బలరాం అందుకు సిద్ధంగా లేడని సమాచారం.