Delta Cran: మొదటగా కోవిడ్ వైరస్ వచ్చి ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేసింది. కోవిడ్ తగ్గుతుంది అన్న సమయంలో ఓమిక్రాన్ వచ్చి మళ్లీ ప్రజలందరిలోను భయాందోళనలు రేపింది. ప్రస్తుతం మనం జాగ్రత్తగా ఉండకపోతే ప్రాణహాని తప్పదని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే కోవిడ్ వైరస్ వేర్వేరు వేరియంట్ ల రూపంలో వ్యాపిస్తుంది. అవి ఆల్ఫా,డెల్టా బీటా, వంటి వేరియంట్లు.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసినటువంటి ఓమిక్రాన్ ప్రపంచంమంతటా అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. తక్కువ కేసులు చూస్తున్నప్పటికీ ఈ ఓమిక్రాన్ తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది. అయితే ఇటీవలే పుట్టుకొచ్చినటువంటి డెల్టా క్రాన్ యూకేలో నమోదు అయ్యింది. ఇది ఒక రకమైన కోవిడ్ స్ట్రెయిన్ జాతికి చెందినదని నిపుణులు తెలుపుతున్నారు.
ఈ డెల్టా క్రాన్ అనేది కొత్త కోవిడ్ స్ట్రెయిన్ అని,అది ఓమిక్రాన్ డెల్టా వేరియంట్ల హైబ్రిడ్ జాతికి చెందినదని నిపుణులు తెలుపుతున్నారు.అయితే డెల్టా క్రాన్ యూకే లో ఒకే వ్యక్తికి వ్యాపించినట్టు గుర్తించారు. రెండు రకాల వేరియంట్లు సోకిన వ్యక్తులో డెల్టా క్రాన్ అనే వేరియంట్ ఉద్భవించినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ డెల్టా క్రాన్ బ్రిటన్ నుంచి వచ్చిందా లేదా అక్కడే పుట్టిందా అన్న విషయం ఇంకా తెలియలేదు. కానీ డెల్టా క్రాన్ వల్ల ఏలాంటి ప్రాణహాని ఉండకపోవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.
యూకేలో డెల్టా క్రాన్,ఓమిక్రాన్ స్ట్రెయిన్ లను తట్టుకోగలిగే భారీస్థాయిలో రోగనిరోధక శక్తిని కలిగి ఉన్నారని దాంతో ఎక్కువ ముప్పు ఉండకపోవచ్చని. ప్రొఫెసర్ పాల్ హంటర్ తెలిపారు. ఓమిక్రాన్,డెల్టా వేరియంట్ మాదిరి లక్షణాలనే కలిగి ఉంటాయని నిపుణులు తెలుపుతున్నారు. డబ్ల్యూహెచ్వో చెబుతున్న ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి SARS-COV-2 వంటి విభిన్న వేరియంట్ల బారిన పడే అవకాశం ఉందని సూచించింది. గతంలో సైప్రస్ ల్యాబ్ లో డెల్టాక్రాన్ అనేది హైబ్రిడ్ కోవిడ్ -19 మ్యూటేషన్ కారణంగానే ఉద్భవించిందనే వార్తలు వచ్చాయి. కానీ ఇది ల్యాబ్ కాలుష్యం ఫలితంగా ఉద్భవించిన వేరియంట్ కాదని నిపుణులు తెలిపారు.అయితే ప్రస్తుతానికి ఈ వేరియంట్ విషయంలో ప్రజలకు ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు.