Mekathoti Sucharitha : రాజీనామాలోనే ‘రాజీ’ వుంటుంది. మాజీ మంత్రి మేకతోటి సుచరిత కూడా రాజీనామా విషయంలో రాజీ పడ్డారు. ‘మంత్రి పదవిలో మిమ్మల్ని కొనసాగించకపోవడమేంటి.? తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసెయ్యండి..’ అంటూ అనుచరులు యాగీ చేశారు.
ఆ అనుచరుల ఒత్తిడికి దిగొచ్చిన మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
అయితే, తనను గతంలో మంత్రిని చేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల విధేయత అనండీ, భయం అనండీ.. కారణం ఏదైతేనేం.. ఆమె వైసీపీకి మాత్రం దూరం అవలేరట. ‘నేను పార్టీకి రాజీనామా చెయ్యను.
నాతోపాటు ఎవరూ పార్టీకి దూరం కావొద్దు.. ఎవరూ తమ పదవులకు రాజీనామా చేయొద్దు..’ అంటూ సుచరిత, తన అనుచరులకు సూచిస్తున్నారు.
దీన్నే పొలిటికల్ హైడ్రామా అంటారు. లేకపోతే, మంత్రి పదవి దక్కలేదని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమేంటి.? తిరిగి తనను మంత్రి వర్గంలో కొనసాంచాలని మేకతోటి సుచరిత, ముఖ్యమంత్రిని కోరొచ్చు. లేదా, పార్టీ కోసం పని చేసి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి.. తిరిగి మంత్రి వర్గంలో చేరొచ్చు.
ఇన్ని అవకాశాలుండగా, మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం అంటే, దాన్ని కేవలం పొలిటికల్ డ్రామాలా మాత్రమే చూడాలేమో. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే.
అయితే, ఇంత పొలిటికల్ డ్రామా ఆడే స్థాయికి సుచరిత రాజకీయంగా ఎలా ఎదిగారని వైసీపీలోనే చర్చ జరుగుతోంది.