మంత్రి పదవి లేదు, చెప్తే వినే నాథుడు లేడు… దీంతో మౌనం దాల్చిన ధర్మాన

ఏపీలో గత కొంత కాలంగా మౌనంగా ఉంటున్న సీనియర్ నేతల జాబితాలో చేరిపోయారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. వైసీపీకి ఉత్తరాంధ్రలో దారి చూపిన ధర్మాన ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు. ఏపీలో ఇన్ని సంఘటనలు చోటుచేసుకుంటున్నా ఆయన ఎందుకు మౌనం వీడడం లేదు. అలకా ? నిరాశ ? అసంతృప్తా? ఏమిటి కారణం ?

ఏపీలో ఎన్నో సంఘటనలు చోటుచేసుకంటున్నాయి. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతిపక్ష టీడీపీని ఎదుర్కొనేందుకు వైసీపీ గణం గట్టిగా బదులిస్తోంది. ఒకప్పుడు సీఎం జగన్ కు  ఎప్పకిప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ప్రతిపక్షం పై విరుచుకుపడే ధర్మాన ప్రసాద్ రావు ఈ మధ్య కనిపించడం లేదు. అధికార, అనధికార అనే తేడా లేకుండా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అది అసెంబ్లీ అయినా లేక పత్రికా సమావేశం అయిన తన పార్టీని కాపాడుతూ అదే సమయంలో ప్రతిపక్షాన్ని ఇరకాటం పెట్టగలిగే సామర్థ్యం ఉన్న ధర్మాన ఇప్పుడు అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

మంత్రి వర్గంలో చోటు దక్కకపోవండో ధర్మాన తీవ్ర నిరాశకు గురయ్యారు. తనకంటే జూనియర్లకు మంత్రి పదవులు ఇచ్చిన సీఎం జగన్… తనను పక్కన పెట్టి అవమాన పరిచారని ఫీల్ అయ్యారట. అయినపప్పటికీ మిన్నకుండిపోతే వెనకబడిపోతామన్న భావనతో పని చేసుకుంటూ పోయారంట.

అయితే ఏపీలో జిల్లాలను విభజించాలని సీఎం జగన్ నిర్ణయించినప్పటి నుంచి వీరిద్ధరి మధ్య ఉన్న మనస్పర్ధలు ఇంకా పెరుగుతూపోయారంట. పార్లమెంటు నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లాల విభజన సరికాదని ధర్మాన గట్టిగా వాదిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాను విడదీస్తే రాజకీయంగా వైసీపీ  దెబ్బతింటుందని హెచ్చరించారట. ప్రజల మనోభావాలను రాజకీయాల కోసం బలిపెట్టడం సరికాదని సూచించారని సమాచారం. ఈపాటికే వెనకబడిపోయిన శ్రీకాకుళం జిల్లా వర్గీకరణతో ఇంకా వెనకబడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారట. జిల్లా వాసులంతా ఉమ్మడిగానే ఒకే జిల్లాలో ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారట.

అయితే ఈ సూచనలను జగన్ ఖాతరు చేయకపోవడంతో తీవ్ర మనస్థానం చెందారట. మంత్రి వర్గంలోకి తీసుకోకున్నా అదే స్పూర్తితో పనిచేసినప్పటికీ… తన సూచనలు సలహాలను కూడా పరిగణలోకి తీసుకోనప్పుడు అనవసరంగా పార్టీ కోసం కష్టపడడం వృధా అనే నిర్ణాయనికి వచ్చారట. ఇక అంతే అప్పటి నుంచి కేవలం తన నియోజకవర్గానికే పరిమితమై అందరికీ దూరంగా ఉంటున్నారట ధర్మాన ప్రసాదరావు.