మూడోవంతు సీట్లు… ఆ స్థానాల్లో ప్రకంపనలు, టీడీపీలో సునామీ!

రిపబ్లిక్ డే నాడు పవన్ తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న నిర్ణయాలు, ప్రకటించిన సీట్లు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు అన్నీ ఒకెత్తు అయితే… సీట్ల విషయంలో ఇచ్చిన స్టేట్ మెంట్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ ఒక్కమాటే టీడీపీలో చిన్నసైజు ప్రకంపనలకు మొదలయ్యాయని తెలుస్తుంది. కారణం… వచ్చే ఎన్నికల్లో మూడోవంతు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని చెప్పడమే!

మూడవ వంతు సీట్లు అంటే సుమారు 60 సీట్లు అన్న మాట. 175లోనూ 60 సీట్లలో జనసేన పోటీ చేస్తుందని పవన్ చెప్పకనే చెప్పారు. ఇదే నిజమైతే… అది జనసేనకు ఎంత బలమో.. టీడీపీకి అంత బలహీనతగా మారే ప్రమాధం లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు. కారణం… ఈ 60 లో టీడీపీకి అత్యంత బలమైనవి, కంచుకోటలు అనబడేవి కూడా జనసేన ఖాతాలోకి వెళ్లిపోబోతున్నాయి!

నిజంగా వచ్చే ఎన్నికల్లో జనసేనకు 60 సీట్లవరకూ ఇవ్వడానికి టీడీపీ అధినేత చంద్రబాబు అంగీకరిస్తే కీలక స్థానాల్లో ప్రకంపనలు రావడం.. ఫలితంగా టీడీపీలో సునామీ రావడం కన్ ఫాం అని అంటున్నారు పరిశీలకులు. కారణం… పవన్ కల్యాణ్ కోరుతున్న సీట్లు అలా ఉన్నాయి మరి. ఇప్పుడు ఆ సీట్లే ప్రకంపనలకు దారితీయొచ్చని అంటున్నారు.

మొత్తం కోస్తా జిల్లాలలో 101 అసెంబ్లీ సీట్లు ఉంటే… వాటిలో 68 సీట్ల్లు ఉత్తరాంధ్రా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో జనసేన పొత్తులో కోరే సీట్లు కూడా ఎక్కువగా ఉత్తరాంధ్రా, ఉభయ గోదావరి జిల్లాల నుంచే ఉన్నాయి. వీటిలో అనేకం టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. ఇపుడు వాటిని పొత్తులో భాగంగా తమకు కేటాయించమని జనసేన కోరుతోంది.

ఉదాహరణకు… ఉదాహరణకు గోదావరి జిల్లాల్లో పిఠాపురం, రాజమండ్రి రూరల్, పెద్దాపురం, కాకినాడ, ఉండి, భీమవరం, తాడేపల్లిగూడేం వంటివి అని చెప్పాలి! ఇదే సమయంలో… విశాఖలో… భీమునిపట్నం, గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి, నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం, శ్రీకాకుళం, పలాసా, ఇచ్చాపురం, ఎచ్చెర్ల వంటి వాటి మీద జనసేన పొత్తులో సీట్లను అడుగుతోందని అంటున్నారు.

అయితే ఈ సీట్లన్నీ టీడీపీ కంచుకోటలనే చెప్పాలి. పైగా… జనసేనకు సీమలో బలం తక్కువగా ఉందని చెబుతున్న సమయంలో… ఆ అరవైలో సుమారు 45 స్థానాలు కోస్తాలోనే దక్కించుకోవాలని.. మిగిలిన సీట్లను ఆయా జిల్లాల్లో ఒక్కోటి, రెండేసి చొప్పున తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే… కోస్తాజిల్లాల్లోని 101 సీట్లలోనూ 45 సీట్లు జనసేన అడుగుతుందన్నమాట! అదే జరిగితే… టీడీపీ పరిస్థితి ఏమిటనేది పెద్ద ప్రశ్న!

ఈ విధంగా పవన్ చెప్పిన “మూడోవంతు సీట్లలో పోటీ” అనే మాట ఇప్పుడు టీడీపీలో కాకరేపుతుంది. ఎవరి సీట్లకు ఎసరు వస్తుందో అని కొందరు ఆలోచిస్తే… పార్టీ పిలక మొత్తం పవన్ చేతుల్లోకి.. రేపు అధికారంలో వస్తే ప్రభుత్వం మొత్తం ఆయన ఆధీనంలోకి వెళ్లే ప్రమాదం పుష్కలంగా ఉందని అంటున్నారట ఇంకొందరు. మరి… జనసేన చెబుతున్నట్లు మూడోవంతు సీట్లు టీడీపీ ఇస్తుందా.. ఈ పొత్తు కడవరకూ నిలుస్తుందా అనేది వేచి చూడాలి!