Sailajanath: సీమనుంచే జగన్ 2.0 అమలు…. శైలజనాథ్ సంచలన వ్యాఖ్యలు!

Sailajanath: దివంగత నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి హయామంలో మంత్రిగా విధులు నిర్వహించిన సింగనమల మాజీ ఎమ్మెల్యే శైలజనాథ్ ఇన్ని రోజులపాటు రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో మంత్రిగా పనిచేశారు అయితే కాంగ్రెస్ ఆంధ్రలో పూర్తిగా వెనుకబడిన నేపథ్యంలో ఈయన కూడా ఇతర పార్టీలలోకి చేరకుండా ఉన్నారు.

ఇకపోతే నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఈయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శైలజనాథ్ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పార్టీ పునర్నిర్మానానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటినుంచి కసరత్తులు మొదలు పెట్టారని తెలిపారు.

ఇక నుంచి 2.0 ఫార్ములా అమలుతో జగన్ తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి రంగంలోకి దిగారు. ఈ లక్ష్యసాధనలో తన తండ్రి దివంగత సీఎం వైఎస్ఆర్ విధేయవర్గాన్ని పార్టీలోకి తీసుకునే కసరత్తులు కూడా నిర్వహిస్తున్నారని శైలజనాథ్ తెలిపారు. ఈయన మాటలను బట్టి చూస్తుంటే మరి కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని స్పష్టం అవుతుంది.

రాయలసీమ నుంచే అస్త్రంగా ఎంచుకున్న 2.0 ఫార్ములాతో వ్యూహం అమలు చేశారు. మొదటగా అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి, పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీలోకి తీసుకున్నారు. ఈయన బాటలోనే మరి కొంతమంది కూడా ఈ పార్టీలోకి రాబోతున్నారనే విషయం తెలియడంతో మొదటి దెబ్బ జగన్ తన చెల్లి షర్మిలకే గట్టిగా వేయబోతున్నారని తెలుస్తోంది. ముందు ముందు పార్టీ పునర్నిర్మాణం కోసం జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.