Corona Virus: ముగింపు దశకు చేరుకున్న కరోనా… ఒమిక్రాన్ వ్యాప్తి పై నిపుణులు ఏమంటున్నారంటే?

Corona Virus: గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి వివిధ వేరియంట్ రూపంలో ప్రపంచ దేశాలన్నింటిలో వణికిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వైరస్ ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో పంజా విసురుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోప్ విభాగం సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ వేరియంట్ కరోనా వైరస్ ను కొత్త దశకు తీసుకు వెళుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ యూరప్ విభాగం డైరెక్టర్ హాన్స్ క్లూగే మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు…

యూరప్ ప్రాంతంలో కరోనా వైరస్ చివరిదశ వైపు పయనిస్తున్నట్లు ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వైరస్ యూరప్ లో అత్యధిక శాతం నమోదవుతుందని అయితే వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత చాలా రోజుల వరకు ప్రతి ఒక్కరిలో వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉండటం వల్ల క్రమంగా ఈ వైరస్ తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఈ క్రమంలోనే ఈ మహమ్మారి ఏడాది చివరికి తిరిగి వచ్చిన మరి వ్యాపించే అవకాశాలు లేవని ఈ వైరస్ చివరి దశకు చేరుకుంటుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక వచ్చే దశనుంచి ఈ వైరస్ సాధారణ ఫ్లూ మాదిరిగా మారిపోతుందని అయితే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు.యూరోపియన్ కమీషనర్ ఫర్ ఇంటర్నల్ మార్కెట్స్‌కు చెందిన థియరీ బ్రెటన్ మాట్లాడుతూ.. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు కొత్త వేరియంట్ లకు అనుగుణంగా మార్పు చేయవచ్చని తెలిపారు.