కోడిగుడ్డు ప్రియులకు బ్యాడ్ న్యూస్.. విపరీతంగా పెరుగుతున్న గుడ్డు ధర.. కరోనా ఎఫెక్ట్ తోనే

eggs price hike due to corona virus

మార్చి, ఏప్రిల్ నెలల్లో అయితే కోడిగుడ్లను పట్టించుకున్నవాళ్లు లేరు. చికెన్ కూడా అంతే. 10 రూపాయలకు, 20 రూపాయలకు కిలో చికెన్ అన్నా ఎవ్వరూ తినలేదు. కోడిగుడ్డు సేల్స్ కూడా అప్పుడు విపరీతంగా పడిపోయాయి. దానికి కారణం ఏంటో కూడా మీకు తెలుసు. అప్పుడే కరోనా వైరస్ భారత్ లో వ్యాపించడంతో.. చికెన్ తిన్నా, గుడ్డు తిన్నా కరోనా వైరస్ వస్తుంది.. అని ఓ పుకారును లేపారు. దాంతో అందరూ చికెన్ ను తినడం మానేశారు.

eggs price hike due to corona virus
eggs price hike due to corona virus

తర్వాత మే నెల నుంచి మళ్లీ చికెన్, కోడిగుడ్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. చికెన్, కోడిగుడ్లు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. రోగ నిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే కరోనా దరిచేరదని చెప్పడంతో ఇక చూసుకోండి.. చికెన్ సేల్స్, ఎగ్స్ సేల్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి.

నిజానికి ఎగ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే. కనీసం రెండు మూడు రోజులకు ఒక్కసారైనా ఎగ్ ను తినాల్సిందే. ఎగ్ బుర్జి, బాయిల్డ్ ఎగ్, ఎగ్ పులుసు, ఆమ్లెట్.. ఇలా ఎగ్ ను రకరకాలుగా వాడుతుంటారు.

ఇక.. కరోనా టైమ్ లో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం ప్రతి ఒక్కరు గుడ్డు తినడం మొదలు పెట్టారు. దీంతో ఎగ్స్ సెల్స్ ఒక్కసారిగా పెరగడంతో.. వాటికి కొరత ఏర్పడింది.

ఒక్క తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకుంటే.. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంతగా గుడ్ల విక్రయాలు తెలంగాణలో జరిగాయట. కోట్లకు కోట్ల గుడ్లను తెలంగాణ ప్రజలు గుటకాయస్వాహ చేసేశారట.

నాన్ వెజ్ తినని వాళ్లు కూడా ఎక్కువగా గుడ్లు తినడానికి ఆసక్తి చూపుతుంటారు. ఇక.. గుడ్డు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుండటంతో దాని ధరను కూడా పెంచేస్తున్నారు. ఇప్పటికే హోల్ సేల్ లో గుడ్డు ధరను 6 రూపాయలకు విక్రయిస్తుండగా… చిన్న చిన్న కిరాణ షాపుల్లో 7, 8 రూపాయలకు అమ్ముతున్నారు.

ఇంకో పది పదిహేను రోజుల్లో ఇలాగే డిమాండ్ ఉంటే 10 రూపాయలకు కూడా ఎగ్ ధర చేరుకోవచ్చని ట్రేడర్స్ చెబుతున్నారు. ఏంటో ఈ కలికాలం. చివరకు గుడ్డు తినాలంటే కూడా కనీసం 10 రూపాయలు పెడితే కానీ దొరకని పరిస్థితి ఏర్పడుతోంది.. అని ప్రజలు ఊసురుమనడం తప్పితే చేసేదేం ఉండదు.