ఈ నగరానికి ఏమైంది రీరిలీజ్ డేట్ లాక్

తరుణ్ భాస్కర్ రెండో సినిమాగా ఐదేళ్ళ క్రితం ఈ నగరానికి ఏమైంది సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో విశ్వక్ సేన్ టాలీవుడ్ లో అందరికి చేరువ అయ్యాడు. ఇక కమెడియన్ అభినవ్ గోమటం కూడా ఈ మూవీతో పరిచయం అయ్యాడు. ఇక మరో యంగ్ హీరో సాయి సుశాంత్, వెంకటేష్ కాకుమాను నటులుగా టాలీవుడ్ లో తమ అదృష్టం పరీక్షించుకున్నారు.

అయితే వీరిలో విశ్వక్ సేన్ కమర్షియల్ హీరోగా మంచి సక్సెస్ అయ్యాడు. తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత తరుణ్ భాస్కర్ ఇప్పటి వరకు నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయలేదు. కొన్ని నెలల క్రితమే మరల కొత్తవాళ్లతో ఓ సినిమాని ఎనౌన్స్ చేసి షూటింగ్ స్టార్ట్ చేశారు. అప్పట్లో యూత్ కి ఈ మూవీ భాగా కనెక్ట్ అయ్యింది.

ప్రెజెంట్ జెనరేషన్ కి కూడా భాగా రీచ్ అవుతుందని భావించి ఈ నగరానికి ఏమైంది సినిమాని మరోమారు రీరిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఇంటరెస్టింగ్ పోస్టర్ తో జూన్ 29న రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సిమ్రాన్ చౌదరి, అనీషా అంబ్రోస్ ఈ మూవీలో హీరోయిన్స్ గా నటించగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించారు. ఇక ఈ మూవీ ఐదేళ్ళు పూర్తయిన సందర్భంగా రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇక ఈ ఈ నగరానికి ఏమైంది రీరిలీజ్ అయ్యే థియేటర్స్ లో ప్రస్తుతం తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న కీడకోలా సినిమా టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారంట. మొదటి రెండు సినిమాల తరహాలోనే సరికొత్త కథాంశంతో కీడకోలా చిత్రాన్ని తరుణ్ భాస్కర్ కొత్తవారితో ఆవిష్కరిస్తుననాడు. మరి ఈ మూవీ ఏ మేరకు ప్రేక్షకులని కనెక్ట్ చేస్తుందనేది చూడాలి.

స్టార్ హీరోల చిత్రాలని రీరిలీజ్ చేయడం ఇప్పటి వరకు ట్రెండ్ గా టాలీవుడ్ లో కొనసాగుతోంది. ఇప్పుడు స్టార్ క్యాస్టింగ్ తో సంబంధం లేకుండా కంటెంట్ ఆడియన్స్ ని రీచ్ అవుతుందని అనుకున్న మూవీని కూడా రీరిలీజ్ చేయొచ్చు అని ఈ నగరానికి ఏమైంది మూవీతో తరుణ్ భాస్కర్ చూపించబోతున్నారు.