Genelia: జెనీలియా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. దాదాపు 13 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న జెనీలియా ఇటీవల కిరీటి రెడ్డి హీరోగా నటించిన జూనియర్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో మరోసారి తన నటన ద్వారా ప్రేక్షకులను ఇప్పించారు.
ఇకపోతే తాజాగా జూనియర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో జెనీలియా పాల్గొన్నారు. ఇందులో భాగంగా యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇందులో సుమ సిద్దార్థ్, జెనీలియా ఉన్న ఫోటోని చూపించడంతో బొమ్మరిల్లు సినిమా గురించి మాట్లాడారు.వావ్ బొమ్మరిల్లు టైంలో తీసుకున్న ఫొటో ఇది. నేను రీసెంట్‌గా ఈ మూవీ రీరిలీజ్ అయినప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్‌లో ఉండే అందుకే రాలేకపోయాను. అయితే నేను మళ్ళీ బొమ్మరిల్లు-2 చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ జెనీలియా మాట్లాడారు.
ఇలా బొమ్మరిల్లు సీక్వెల్ సినిమాకు తాను సిద్ధమే అంటూ జెనీలియా మాట్లాడటంతో వెంటనే సుమా కూడా స్పందిస్తూ…మేము కూడా అదే కోరుకుంటున్నాము. సీరియస్‌గా చెప్పాలంటే మీకు మ్యారేజ్ అయి ఇద్దరు పిల్లలు ఉన్నా కానీ ఏమీ చేంజ్ కాలేదు. ఇప్పుడు కూడా నిన్ను హాసినిలా దించేయవచ్చు అని పొగడ్తలతో ముంచేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి బొమ్మరిల్లు సీక్వెల్ జెనీలియా సిద్ధమయ్యారని, దర్శక నిర్మాతలదే ఆలస్యం అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.
