తిరుపతి సమీపంలో స్వల్ప భూప్రకంపనలు ఏర్పడ్డాయి. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంటల సమయంలో తిరుపతికి సమీపంలోని ప్రాంతాల్లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్కాలజీ తెలిపింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.6గా నమోదు అయింది. భూకంప కేంద్రం తిరుపతికి 85 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదు.