వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులు కూడా మొదలైపోయాయి. ఈ సమయంలో మనకు దాహం ఎక్కువ వేస్తుంది. దీంతో కూల్ వాటర్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్.. వైపు చూస్తూంటాం. కొబ్బరినీళ్లు కూడా ఎక్కువగా తాగుతాం. కానీ.. నిపుణులు చెప్పేదేంటంటే వేసవిలో కొబ్బరినీళ్లే ఉత్తమం అని. బాడీ హీట్ తగ్గిస్తుంది. దాహం తగ్గిస్తుంది. శరీరంలో కొవ్వు ఏర్పడదు. ఇన్ని లాభాలున్నప్పుడు మండు వేసవిలో కొబ్బరినీళ్లు కాకుండా మరో ప్రత్నామ్నాయం ఎందుకు అనేది నిపుణుల మాట.
కొబ్బరినీళ్లు మన శరీరానికి ఇచ్చే శక్తి చాలా విలువైంది. షుగర్ వ్యాధి ఉన్నవారు తాగొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. కొబ్బరి నీళ్లు తాగితే షుగర్ లెవల్స్ పెరగవని.. తగ్గుతాయని అంటున్నారు. ఇక కొబ్బరినీళ్లను దాహం వేస్తేనో, ఎండలో తిరిగి వస్తేనో కాకుండా పరగడుపున కూడా తొగొచ్చని చెప్తున్నారు. అలా తాగితే శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది. ఉదయాన్నే కొబ్బరినీళ్లు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ అందడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
ముఖ్యంగా గుండెకు కొబ్బరినీళ్లు చాలా మంచిది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. కొబ్బరినీళ్లు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. నరాల సమస్యలు తొలగుతాయి. కండరాల పుష్టి కలుగుతుంది. జీర్ణ సంబంధ సమస్యలు తొలగుతాయి. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం సమస్యలు తొలగుతాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బీపీ కూడా అదుపులో ఉండేలా చేస్తుంది. కొబ్బరినీళ్లు వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తాయి. శరీరానికి చల్లదనం ఇస్తాయి.
శరీరానికి ఇంత మేలు చేసే కొబ్బరినీళ్ల ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ప్రతిరోజూ కొబ్బరినీళ్లు తాగితే వేసవిలో శరీరానికి కావాల్సిన శక్తి, అలసిపోకుండా ఉండేందుకు చురుకుదనం లభిస్తుంది. శరీరానికి చల్లని పానీయాలు అందించే కంటే కొబ్బరినీళ్లు తాగుతున్నప్పుడు మానసికంగా కూడా ఒకరరమైన తృప్తి ఉంటుంది. ఒక కొబ్బరి బొండాం ఒక సెలైన్ బాటిల్‌తో సమానం అంటారు. శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. అంతకుమించి ఇంకేం కావాలి.
గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించాం. ఆరోగ్య సంబంధిత విషయాల్లో, అనారోగ్య సమస్యల విషయంలో సలహాలకు వైద్యులు లేదా ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అర్హులైన వైద్య నిపుణుల సలహాలకు ఇది ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు. ఈ సమాచారానికి ‘తెలుగు రాజ్యం’ ఎలాంటి బాధ్యత వహించదు.