Durga Rao: దుర్గారావు పరిచయం అవసరం లేని పేరు ఎక్కడో మారుమూల గ్రామంలో రోజువారి పనులు చేసుకుంటూ జీవనం వెల్లదీస్తున్న దుర్గారావు దంపతులు టిక్ టాక్ ద్వారా వీడియోలు చేస్తూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ జంట పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియోలకు ఎంతో మంచి ఆదరణ లభించింది. ఇలా టిక్ టాక్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న దుర్గారావు దంపతులు యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. ప్రస్తుతం వరుస యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఈ జంట నాది నక్కలీసు గొలుసు అనే పాటకు చేసిన డాన్స్ వీడియో ఒకానొక సమయంలో సోషల్ మీడియాను షేక్ చేసింది అని చెప్పాలి. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ జంటకు జబర్దస్త్ కార్యక్రమం తో పాటు ఇతర బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున అవకాశాలు రావడం అదేవిధంగా సినిమాలలో కూడా అవకాశాలు అందుకోవటం జరిగింది. అయితే ఇటీవల దుర్గారావు దంపతులు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తమ యూట్యూబ్ ఆదాయం గురించి తెలియజేశారు తమకు యూట్యూబ్లో వచ్చిన డబ్బుతో తమ గ్రామంలో రెండు ఇండ్లు కట్టుకున్నామని తెలిపారు. వచ్చిన డబ్బును వాడుకుంటే వృధా అవుతుంది అందుకే వచ్చిన డబ్బుతో ఇంటిని క్రమక్రమంగా పూర్తి చేశామని అలా రెండిళ్ళు కట్టుకున్నామని తెలిపారు. ఇలా రెండు ఇల్లు కట్టుకోవడంతో వీరి యూట్యూబ్ ఆదాయం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఒక్కోనెల లక్ష రూపాయల వరకు వస్తుందని ఒక నెల 10,000 వరకు కూడా డబ్బులు రావని తెలిపారు. ఇలా సంవత్సరం అంతా బెరీజు చేసుకుంటే నెలకు 30 నుంచి 40 వేల వరకు ఆదాయం వస్తుందని ఈ జంట తెలియజేశారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పేద కుటుంబంలో జీవనం వెల్లదీస్తున్న దుర్గారావు దంపతులు ప్రస్తుతం సెలబ్రిటీ హోదా అనుభవిస్తూ ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారని చెప్పాలి.
