భార్య నగల షాపింగ్ కి భయపడి దేవుడికి దండం పెట్టుకున్న డాక్టర్ బాబు..!

బుల్లి తెర మీద ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ఎన్నో జంటలు బాగా పాపులర్ అయ్యాయి. అలా రీల్ లైఫ్ లోనే కాకుండ రియల్ లైఫ్ లో జంటగా గుర్తింపు పొందిన వారిలో మంజుల నిరుపమ్ జంట కూడా ఒకటి. చంద్రముఖి సీరియల్ ద్వారా మొదలైన వీరీ పరిచయం ప్రేమగా మారి పెళ్ళి వరకు తీసుకువెళ్ళింది. వీరిద్దరూ జంటగా ఎన్నో సీరియల్స్ లో నటించారు. కానీ చంద్రముఖి సీరియల్ వారి లైఫ్ ని మార్చేసింది. ఇదిలా ఉండగా కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ పాత్రలో నటించిన నిరుపమ్ ఆ సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా మంచి గుర్తింపు పొందాడు. దాదాపు నాలుగు సంవత్సరాలు ఈ సీరియల్ లో నటించిన నిరుపమ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. దీంతో ఇప్పటికీ నిరూపమ్ ని అందరూ డాక్టర్ బాబు అని పిలుస్తూ ఉంటారు.

అయితే కొంతకాలంగా నిరుపమ్ బుల్లితెర మీద ప్రసారం అవుతున్న ఏ సీరియల్ లో కూడా కనిపించడం లేదు. దీంతో కార్తీక్ దీపం సీరియల్ లో మళ్లీ నిరూపమ్ రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు. నిరుపమ్ సీరియల్స్ లో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు ఎప్పుడు టచ్ లో ఉంటున్నాడు. మంజుల నిరూపమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ఆ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోస్ చేస్తూ సందడి చేస్తున్నాడు. ఈ ఛానల్ ద్వారా నిరూపమ్ తన భార్య మంజులతో కలిసి షాపింగ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, ట్రావెల్ వీడియోస్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు.

ఇటీవల నిరూపమ్ తన భార్య మంజులతో కలిసి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా బంగారం షాపింగ్ చేయటానికి వెళ్ళాడు. ఈ షాపింగ్ కి సంబంధించిన వీడియో యూట్యూబ్ లో షేర్ చేశారు. ఈ వీడియోలో నిరూపం మంజుల సీఎంఆర్ గోల్డ్ షాప్ కి వెళ్లి అక్కడ ఆ షాప్ ని ప్రమోట్ చేస్తూ షాప్ లో ఉన్న బంగారు ఆభరణాలు అన్నింటిని చూసారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఎంతో కొంత గోల్డ్ కొంటె దానికి రెట్టింపు మళ్లీ మనకు వస్తుందని మంజుల తన నమ్మకాన్ని వెల్లడించింది. ఈ క్రమంలో మంజుల పెద్ద పెద్ద బంగారు హారాలు,వడ్డాణం, చెవి దుద్దులు అన్ని సెలెక్ట్ చేసి పెడుతుంది. తర్వాత నిరుపమ్ కోసం కూడా పెద్ద గోల్డ్ చైన్ చూస్తారు. నిరుపమ్ ఆ చైన్ వేసుకోగానే శంకర్ దాదాలా ఉన్నావు అని అంటుంది. అయితే ఈ వీడియోలో నిరుపమ్ షాపింగ్ బిల్ తక్కువయ్యేట్టు చూడు అంటూ దేవుడికి దండం పెట్టేస్తాడు .