హాస్పిటల్ లో “చంద్రముఖి” నటుడు.!

రీసెంట్ గా టాలీవుడ్ లో సహా తమిళ సినిమా నుంచి కూడా పలు తీవ్ర విషాదాలు ఎవరో ఒక నటునికి సంబంధించి చేదు వార్తలే వింటున్నాము. అలాగే మొన్న తమిళ స్టార్ అండ్ సీనియర్ కామెడియన్ అయినటువంటి మయిల్ సామి కన్ను మూయడంతో తమిళ ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి లోనయ్యింది.

కాగా ఇప్పుడు తమిళ్ మరియు టాలీవుడ్ ల బాగా తెలిసినటువంటి నటుడు ప్రభు ఇప్పుడు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మరిన్ని డీటెయిల్స్ లోకి వెళితే ఈ చంద్రముఖి నటుడు గత కొన్ని రోజులు కోటం తీవ్ర కడుపు నొప్పికి లోనయ్యారట.

మరి దీనికి కారణం తన కడుపులో కొన్ని రాళ్లు వంటివి ఫామ్ అవ్వడం వల్ల తాను అనారోగ్యం పాలయ్యారట. దీనితో ప్రభు ఇప్పుడు హాస్పిటల్ లో అడ్మిట్ కావడం తన రాళ్ళకి సర్జరీ కూడా చేయించుకోవడం జరిగిందట. దీనితో ఇప్పుడు ప్రభు ప్రస్తుతానికి హాస్పిటల్ లోనే ఉండగా మరికొన్ని రోజులు తర్వాత తాను ఇంటికి వెళ్తారట.

దీనితో ఈ వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. మరి ఈ స్టార్ నటుడు చంద్రముఖి సినిమా నుంచి బాగా ఫేమస్ కాగా తెలుగులో డార్లింగ్, ఆరెంజ్, ఒంగోలు గిత్త ఇంకా ఎన్నెన్నో సినిమాల్లో తాను నటించారు. అలాగే తమిళ్ లో వరుస సినిమాలు చేస్తున్నారు.