తెలుగు సినిమా సహా సౌత్ ఇండియా సినిమా దగ్గర ఏదన్నా అకేషన్ వస్తుంది అని మూవీ లవర్స్ కి పండగే అని చెప్పాలి. అలా ప్రతి పండుగకి కూడా కొత్త కొత్త సినిమాలు భారీ చిత్రాలు అలాగే ప్రముఖ హీరోల సినిమాలు కూడా వస్తుంటాయి. మరి అలా ఈసారి వినాయక చవితికి ఆల్రెడీ సెప్టెంబర్ 15 రిలీజ్ అంటూ తెలుగు సినిమా సహా కోలీవుడ్ నుంచి కూడా మూడు సినిమాలు అది కూడా మిడ్ రేంజ్ స్టార్ హీరోల సినిమాలే మంచి బజ్ ఉన్న సినిమాలే లాక్ చేసారు.
కానీ ఈ రేస్ నుంచి ఇప్పుడు ఊహించని విధంగా ఒకో సినిమా ఖాళీ అయిపోతుంది. మొదటగా అయితే ఉస్తాద్ రామ్ పోతినేని అలాగే బోయపాటి శ్రీను కాంబినేషన్ చిత్రం “స్కంద” ని పోస్ట్ పోన్ చేయగా ఈ తర్వాత తమిళ అవైటెడ్ సీక్వెల్ చిత్రం రాఘవ లారెన్స్ నటించిన సినిమా “చంద్రముఖి” ని రిలీజ్ వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు.
దీనితో మూడింటిలో రెండు సినిమాలు వినాయక చవితికి బాక్సాఫీస్ దగ్గర తప్పుకోగా ఇప్పుడు మూడో సినిమా “మార్క్ ఆంటోనీ” విశాల్ మరియు ఎస్ జె సూర్య లు నటించిన చిత్రం ఇది కూడా వాయిదా పడుతుంది అని రూమర్స్ మొదలయ్యాయి. దీనితో ఇదీ నిజం అయితే మాత్రం ఈ వినాయక చవితికి మొదటిసారి ఏ నోటెడ్ సినిమా రిలీజ్ లేకుండా ఉంటుంది అని చెప్పాలి. దీనితో ఈ గణేష్ చతుర్థికి బాక్సాఫీస్ ఫైట్ చప్పగా ఉంటుంది అని చెప్పాలి.